Home » Deputy CM Pawan Kalyan
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ స్థలం పత్రాలను ఆ గ్రామ పెద్దలకు అధికారికంగా అంద చేశారు. మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి.. ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు.
Andhrapradesh: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వర్కుషాపుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి. జల, వాయి కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి’’...
పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన పవన్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కూతురు ఆధ్య తో ఆయన దర్శనానికి వచ్చారు. అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత వచ్చారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చూడగానే భక్తులలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం స్టువర్టుపురం ప్రాంతంలో ఓ బాలిక సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ మహిళ, మరో వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఆటో ఆపారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు.
అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఒక మతానికే ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు.
Andhrapradesh: ఈరోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభ జరుగనుంది. అయితే జ్వరంతోనే ఈ సాయంత్రం జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అయితే నిన్నటి నుంచి అతిధిగృహంకే పరిమితమైన డిప్యూటీ సీఎం ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయ్యారు.
Andhrapradesh: తన ఇద్దరు కుతూరులతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పవన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు.
Andhrapradesh: ముందుగా అనుకున్న ప్రకారం పవన్ అలిపిరి చేరుకుని మెట్ల మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అయితే ఉపముఖ్యమంత్రి కాలిబాటన తిరుమలకు వెళ్లటానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
Andhrapradesh: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ చక్రవర్తి తనదైన ముద్ర వేశారన్నారు.