Pawan Kalyan: జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ | Deputy CM Pawan suffering from fever Tirumala Andhrapradesh Suchi
Share News

Pawan Kalyan: జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:05 PM

Andhrapradesh: ఈరోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభ జరుగనుంది. అయితే జ్వరంతోనే ఈ సాయంత్రం జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అయితే నిన్నటి నుంచి అతిధిగృహంకే పరిమితమైన డిప్యూటీ సీఎం ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయ్యారు.

Pawan Kalyan:  జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌
Deputy CM Pawan Kalyan

తిరుమల, అక్టోబర్ 3: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) జ్వరంతో బాధపడుతున్నారు. నిన్నటి (బుధవారం) నుంచి తీవ్ర జ్వరంతో ఉపముఖ్యమంత్రి ఇబ్బందిపడుతున్నారు. జ్వరం కారణంగా వైద్య బృందం పవన్ వద్దకు చేరుకుని చికిత్స అందించారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభ జరుగనుంది. అయితే జ్వరంతోనే ఈ సాయంత్రం జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Janimaster: జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే

ABN ఛానల్ ఫాలో అవ్వండి

అయితే నిన్నటి నుంచి అతిధిగృహంకే పరిమితమైన డిప్యూటీ సీఎం ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయ్యారు. ఈరోజు జరుగనున్న వారాహి సభలో ఏం మాట్లాడాలన్న అంశంపై నేతలతో పవన్ చర్చించారు. ఈ సాయంత్రం 5 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరనున్న పవన్.. 6 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరగనున్న వారాహి సభలో పాల్గొంటారు. అలాగే పవన్ కళ్యాణ్‌తో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. టీటీడీలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి పవన్ కళ్యాణ్‌కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు.


కాగా.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్.. దీక్ష విరమణ కోసం తిరుమలకు వచ్చారు. నిన్న(బుధవారం) శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించారు. అక్టోబర్ 1న మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నడకమార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలనుకున్న ఆయన.. ఎయిర్‌పోర్టు నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు.

Cm Revanth Reddy: సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్‌ కార్డులు అవసరం


మెట్ల మార్గంలో వెళ్లి దీక్ష విరమించనున్నట్టు ఇదివరకే ప్రకటించడంతో... సాయంత్రం 4:50 గంటల ప్రాంతంలో అలిపిరి చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ఠ భద్రత మధ్య పవన్‌ కళ్యాణ్‌ నడక మొదలుపెట్టారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. అక్కడి నుంచి గాయత్రి సదన్‌కు చేరుకుని అక్కడే బస చేశారు. నిన్న (గురువారం) ఉదయం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన పవన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కుమార్తెలతో కలిసి శ్రీనివాసుడిని ఉపముఖ్యమంత్రి దర్శించుకున్నారు.


అయితే చిన్నకుమార్తె పలీనా అంజనిని తొలిసారి మీడియా ముందుకు తీసుకొచ్చిన పవన్.. ఆమె శ్రీవారి దర్శనం కోసం డిక్లరేషన్‌ ఇచ్చారు. పలీనాతో డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేయించారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. శ్రీవారి దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ను స్వామి వారి పాదాల వద్ద ఉంచి పవన్ ఆశీస్సులు పొందారు. ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆలయం వెలుపల మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో బుక్‌ను రూపొందించినట్లు సమాచారం. నేటి వారాహి సభలో పుస్తకంలోని అంశాలను ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి..

Durgamma Temple: వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. దుర్గమ్మ ప్రత్యేక సాంగ్

Sharannavaratri: దేవీనవరాత్రులు.. ఒక్కో ఆలయంలో ఒక్కో రూపంలో అమ్మవారు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2024 | 04:44 PM