Share News

Pawan Kalyan: షెడ్యూల్ కంటే ముందే తిరుమలకు పవన్.. పర్యటనలో మార్పులు

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:48 PM

Andhrapradesh: ముందుగా అనుకున్న ప్రకారం పవన్ అలిపిరి చేరుకుని మెట్ల మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అయితే ఉపముఖ్యమంత్రి కాలిబాటన తిరుమలకు వెళ్లటానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

Pawan Kalyan: షెడ్యూల్ కంటే ముందే తిరుమలకు పవన్.. పర్యటనలో మార్పులు
Deputy CM Pawan Kalyan

తిరుపతి, అక్టోబర్ 1: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో (Tirumala Laddu) వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) దీక్ష విరమణ కోసం తిరుమల చేరుకున్నారు. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటుకున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం పవన్ అలిపిరి చేరుకుని మెట్ల మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే ఉపముఖ్యమంత్రి కాలిబాటన తిరుమలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

SIT: టీటీడీ లడ్డూ వివాదం.. సిట్‌ విచారణకు బ్రేక్


సెక్యూరిటీ సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గానే తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో అలిపిరి నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి పవన్ కల్యాణ్ వెళ్లినట్టు నేతలు చెబుతున్నారు. శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. తిరుమలలో గాయత్రి సదన్‌లో రాత్రికి బస చేయనున్నారు. రేపు (అక్టోబర్ 2) శ్రీవారిని పవన్ దర్శించుకోనున్నారు. రేపంతా ఆయన తిరుమలలోనే ఉండనున్నారు. దీక్ష విరమించిన తరువాత ఎల్లుండి (అక్టోబర్ 3) సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్న వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు.

Viral Video: అది ఓడ అనుకున్నావా.. ఆర్టీసీ బస్ అనుకున్నావా.. ఇతడేం చేశాడో చూడండి..



కాగా.. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సెప్టెంబర్ 22 నుంచి 11 రోజులపాటు ఆయన ప్రాయశ్చిత దీక్షలో ఉన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష తీసుకున్నారు. మెట్ల మార్గంలో వెళ్లి దీక్షను విరమించనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. కానీ భద్రత కారణంగా ఆయన మెట్ల మార్గంలో వెళ్లలేకపోయారు. దీంతో షెడ్యూల్ కంటే గంట ముందే రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేరుకున్నారు.

MUDA Case: రాజకీయ కుట్రల బాధితురాలు నా భార్య: సిద్ధరామయ్య


ఇదిలా ఉండగా... శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడినట్టు నిర్ధారణ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

Kadambari Jethwani: నటి జెత్వానీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం

SIT: టీటీడీ లడ్డూ వివాదం.. సిట్‌ విచారణకు బ్రేక్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 05:06 PM