Pawan Kalyan: ఆ పాటను ఎవరూ మరిచిపోలేరు.. మిథున్‌కు అభినందనలు
ABN , Publish Date - Sep 30 , 2024 | 04:33 PM
Andhrapradesh: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ చక్రవర్తి తనదైన ముద్ర వేశారన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 30: ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తికి (Mithun Chakraborty) ‘‘దాదాసాహెబ్ ఫాల్కే’’ (Dada Saheb Phalke) పురస్కారం వరించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అభినందనలు తెలియజేశారు. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు.
TGRTC: సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం..
మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ చక్రవర్తి తనదైన ముద్ర వేశారన్నారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉందన్నారు. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయని గుర్తుచేశారు. ‘‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్...’’ అనే పాటను ఎవరూ మరచిపోలేరన్నారు. హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ తరవాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు మిథున్ చక్రవర్తి అని అన్నారు.
‘‘నేను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న మిథున్ చక్రవర్తికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Maharashtra: ఆవును 'రాజ్యమాత'గా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
కాగా.. సినీరంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌గా భావించే ‘‘దాదా సాహెబ్ ఫాల్కే’’ అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తిని వరించిన విషయం తెలిసిందే. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా సోమవారం నాడు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా పేర్కొంది. 1950లో కోల్‌కతాలో జన్మించిన మిథున్ చక్రవర్తి.. 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1976లో ‘‘మృగాయ’’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. తొలి చిత్రంతోనే ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నారు.
Railways: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. మీ కోసం కొత్త రూల్స్.. ఇకపై రైళ్లలో మీరు..
హిందీ, బెంగాలీ, కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్‌పురి చిత్రాల్లోనూ నటించి మెప్పించారు మిథున్ చక్రవర్తి. 1989లో మిథున్ చక్రవర్తి 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హీరోగానే కాకుండా సహాయనటుడిగా, విలన్‌గా కూడా ఆయన ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్రం ‘‘గోపాల గోపాల’’ చిత్రంలో నటించి తెలుగువారికి సుపరిచితమయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో మిథున్ చక్రవర్తి ‘‘పద్మభూషణ్’’ అవార్డును కూడా అందుకున్నారు. అక్టోబర్ 8న జరగనున్న జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
మేము సైతం అంటున్న ప్రముఖులు.. వరద బాధితులకు విరాళాల వెల్లువ
BT Naidu: పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం చంద్రబాబు పాలనలోనే..
Read Latest AP News And Telugu News