Home » Deputy CM Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
Andhrapradesh: భారత జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహినీయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరువదన్నారు. ఈ రోజు పింగళి వెంకయ్య జయంతి అని... ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో వెంకయ్య మువ్వన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు.
అయిదున్నర శతాబ్దాలుగా ఇదే ఇంటిలో నివాసముంటున్నాం. కోర్టు డిక్రీ ద్వారా మాకు ఇది దఖలు పడింది.
Andhrapradesh: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు కారుపై జరిగిన రాయి దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దాడి జరిగిన ప్రాంతమైన హాస్టల్ పరిసరాల్లో జీలుగుమిల్లీ సీఐ క్రాంతి కుమార్, బుట్టాయిగూడెం ఎస్సై వెంకన్న తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... కర్రలతో దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు.
జనసేన (Janasena) క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును పొడిగించినట్లు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. మరో వారం రోజులపాటు సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి ప్రజా సమస్యల పరష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధి హామీ నిధులు రూ.250కోట్లు, నీరు- చెట్టు కింద రూ.45కోట్లు విడుదల చేసినందుకు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు.. ప్రతిపక్షాలు ఎదుర్కొన్న హింసా రాజకీయాలు.. బాధితులే నిందితులైన ప్రభుత్వ టెర్రరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. కట్టుతప్పిన శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి, డ్రగ్స్ దిగుమతితో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో వివరించారు. శాంతి భద్రతల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ హయాంలో జరిగిన అరాచకాలపై
Andhrapradesh: ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శాసనమండలిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... దేశంలోనే ఈ వేస్ట్‌లో రాష్ట్రం పన్నెండో స్థానంలో ఉందన్నారు. ఈ వేస్ట్ రిసైక్లింగ్ కోసం రాష్ట్రంలో ఆరు కేంద్రాలున్నాయన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామన్నారు. పెరుగుతున్న ఈ వేస్ట్‌కు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రీ సైక్లింగ్ సెంటర్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి(Bhuduru Lakshmi) సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సర్పంచ్‌ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.