Share News

AP-Karnataka: ఏపీ, కర్నాటక ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం.. ఏ విషయంలో అంటే

ABN , Publish Date - Sep 27 , 2024 | 01:58 PM

Andhrapradesh: పంట పొలాలను ఏనుగులు విధ్వంసం చేస్తున్నాయని.. గిరిజన ప్రాంతాలలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబుకు కూడా వివరించానన్నారు. కర్నాకటలో కుంకీ ఏనుగుల ద్వారా వాటిని నివారించవచ్చని గుర్తించామన్నారు.

AP-Karnataka: ఏపీ, కర్నాటక ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం.. ఏ విషయంలో అంటే
key agreement between the governments of AP and Karnataka

విజయవాడ, సెప్టెంబర్ 27: కుంకీ ఏనుగుల ద్వారా పంట పొలాలను రక్షించేలా, ఏనుగుల దాడులను నిరోధించేలా కర్నాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీశాఖ అధికారుల మధ్య ఆరు అంశాలకు సంబంధించిన పత్రాలపై శుక్రవారం సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్నాటక మంత్రి ఈశ్వర్ కండ్రే, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

Viral News: హమ్ దో హమారే దో డజన్‌పై క్లారిటీ



కుంకీ ఏనుగుల ద్వారా...

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పంట పొలాలను ఏనుగులు విధ్వంసం చేస్తున్నాయని.. గిరిజన ప్రాంతాలలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబుకు కూడా వివరించానన్నారు. కర్నాకటలో కుంకీ ఏనుగుల ద్వారా వాటిని నివారించవచ్చని గుర్తించామన్నారు. సీఎం ఆదేశాలతో కర్నాటక ప్రభుత్వంతో చర్చలు చేశానని.. విధాన్ సౌధకు వెళ్లి అక్కడ అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు. సీఎం సిద్దరామయ్యను కూడా కలిసి కోరగానే మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.


ఇదే ప్రథమం..

‘‘నేను చెప్పిన సమస్యలపై వారు స్పందించిన తీరుకు ధన్యవాదాలు. ఈశ్వర్ కండ్రే కూడా ఎం.ఓ.యూ చేసుకుందామని ప్రతిపాదించారు. అటవీశాఖలో ఇరు రాష్ట్రాల మధ్య ఎం.ఓ.యూలు తీసుకోవడం ఇదే ప్రథమం. ఆరు అంశాలపై ఈ ఒప్పందాలు నేడు చేసుకున్నాం. మనకు ఏనుగులు సంఖ్య ఎక్కువ.. వాటిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచన చేశాం. మావటీలు, కావటీలకు శిక్షణ, సామర్ధ్యం పెంచేలా ఏనుగుల శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. కుంకీ ఏనుగులను దసరా తర్వాత ఇక్కడకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాం. మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తాం. ఏనుగు శిబిరాల సంరక్షణకు పోషకాహారం, ఆరోగ్యం కోసం నాలెడ్డ్ ట్రాన్స్ పర్స్ అందిస్తాం. ఇంటర్ స్టేట్‌ల కోఆర్డినేషన్ ‌ల ద్వారా ఎర్రచందనం, శ్రీగంధం చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకుంటాం. ఇలాంటి ఎం.ఓయూ గత వైసీపీ ప్రభుత్వం చేసి ఉంటే... తరలిపోయిన ఎర్ర చందనం మనకు తిరిగి వచ్చేది’’ అని పేర్కొన్నారు.

Tirumala Laddu: నోటికి శూలాలు గుచ్చుకొని..


ఐటీ పనితీరు అద్భుతం...

కర్నాటకలో ఐటీ పనీతీరు చాలా అద్భతంగా ఉందని కొనియాడారు. ఒక చెట్టు పడిపోయినా, ఆక్రమణలు గురైనా వెంటనే యాప్‌లో చూసే వీలుందన్నారు. ఆ టెక్నాలజీని కూడా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని తెలిపారు. కర్నాటకలో ఎకోటూరిజం ద్వారా ఉద్యోగాలు ఎక్కువ అని.. చంద్రబాబు కూడా దీనిపై ఇప్పటికే చర్చించారన్నారు. అక్కడ పని విధానాన్ని పరిశీలించి.. ఇక్కడ కూడా అమలు చేస్తామని వెల్లడించారు. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో వీటి అమలు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఈ ఎం.ఓయూని ముందుకు తీసుకు వెళ్లడానికి స్వాతంత్ర్య సమరయోధుడు భీమన్న కుమారుడు కీలకంగా వ్యవహరించారని చెప్పారు.

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..


కర్నాటక సీఎంకు ధన్యవాదాలు...

కర్నాటకలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. రెండు విభిన్న ప్రభుత్వాలు ఉన్నా.. ఈ ఒప్పందాలు ప్రజల అవసరాల కోసం చేసుకున్నామని తెలిపారు. పార్టీలు వేరైనా.. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చినందుకు కర్నాకట సీఎం సిద్దరామయ్య, ఈశ్వర్ కండ్రేకు ధన్యవాదాలు తెలియజేశారు. కోట్ల విలువైన ఎర్ర చందనం ఏపీ నుంచి రవాణా చేస్తుండగా కర్నాటకలో పట్టుకున్నారన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడి... ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

Anam Ramanarayana: సంతకం పెట్టాల్సిందే.. లేకపోతే అడుగుపెట్టనివ్వం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 01:58 PM