Share News

Perninani: పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా.. పేర్ని సూటి ప్రశ్న

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:46 PM

Andhrapradesh: పవిత్ర దేవాలయాన్ని, ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవం అయిన భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసేలా సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ పంది కొవ్వు కలిసింది అని మాట్లాడారని.. లోకేష్, సీఎం చంద్రబాబువి దుర్మార్గపు మాటలంటూ విరుచుకుపడ్డారు.

Perninani: పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా.. పేర్ని సూటి ప్రశ్న
Former Minister Perni Nani

అమరావతి, సెప్టెంబర్ 25: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై (Deputy CM Pawan Kalyan) మాజీ మంత్రి పేర్నినాని (Former Minister Perninani) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని... అలాంటి ప్రసాదాలు భక్తులకు పంచారని అసత్య ప్రచారం చేశారన్నారు. తిరుమల, తిరుపతి పవిత్రతను, లడ్డు ప్రసాదాన్ని దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. పవిత్ర దేవాలయాన్ని, ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవం అయిన భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) పంది కొవ్వు కలిసిందని మాట్లాడారని.. లోకేష్, సీఎం చంద్రబాబువి (CM Chandrababu Naidu) దుర్మార్గపు మాటలంటూ విరుచుకుపడ్డారు.

Minister Lokesh: క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: మంత్రి లోకేశ్..


పవన్ కళ్యాణ్ ఆ మాటలు బుజాన వేసుకొని ప్రచారం చేశారన్నారు. కూటమి నేతలు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారన్నారు. సెప్టెంబర్ 28న కూటమి నేతల పాపాల్ని క్షమించి వదిలి వేయాలని పూజలు నిర్వహించాలని కోరారు. ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వాళ్ళు చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే ఆత్మగా ఉన్నారన్నారు. రాజకీయాల కోసం వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశామని వాళ్ళ ఆత్మ దహించుకుపోతుందని.. అందుకే గుళ్ళలో మెట్లు కడగటాలు, బోట్లు పెట్టడాలు, ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారన్నారు.

Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ యువతి కాలక్షేపం.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..



‘‘పవన్ కళ్యాణ్ హిందువు అని చెబుతున్నారా? భీమవరంలో బాప్టిజం తీసుకున్న అని చెప్పారు.. ఆ పవన్ కళ్యాణ్‌ ఏనా.... ఈ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్న అని చెప్పింది ఎవరు మర్చిపోరు. రష్యాలో చర్చిలో మొకాళ్ళపై కూర్చున్నది ప్రజలు మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ పిల్లలకు క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నారు. మేము అంతా మొదటి నుంచి హిందువులం. పవన్ కళ్యాణ్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా’’ అని పేర్ని నాని ప్రశ్నలు సంధించారు.


ఇవి కూడా చదవండి..

Donations: ఏపీ వరద బాధితులకు సుప్రీం తెలుగు న్యాయవాదుల విరాళం

Tirumala Laddu: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 04:50 PM