Pawan Kalyan: ‘‘ఓం నమో నారాయణాయ’’... కీరవాణికి ధన్యవాదాలు
ABN , Publish Date - Sep 30 , 2024 | 01:06 PM
Andhrapradesh: ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారని.. వారంతా ‘‘ఓం నమో నారాయణాయ ’’ మంత్రం పఠిస్తున్నారని.. అందుకు అనువుగా కీరవాణి ఆడియో రికార్డు చేశారని..
అమరావతి, సెప్టెంబర్ 30: ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణికి (popular music director MM Keeravani) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘ఓం నమో నారాయణాయ’’ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించినందుకు గాను కీరవాణికి ఉపముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పవన్ సోమవారం ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.
DSC Results 2024: ఒక్క క్లిక్‌తో డీఎస్సీ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా
ప్రతీ ఒక్కరూ కూడా..
తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించినట్లు తెలిపారు. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో పాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారన్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారని చెప్పారు. అందుకు అనువుగా కీరవాణి ఆడియో రికార్డు చేశారని.. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకు, సాంకేతిక నిపుణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రపంచవ్యాప్తంగా దుమారం..
కాగా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అవడం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటపెట్టారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిదంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రతీఒక్కరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. హిందువులు, హిందూ సంఘాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బాధ్యుడిని చేస్తూ హిందూ సంఘాలు, కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
TG Highcourt: నేనడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురక
సిట్ విచారణ వేగవంతం..
అలాగే ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్‌గా తీసుకున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ లడ్డూ వివాదంపై ప్రత్యేక విచారణ కమిటీ(సిట్) ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న సిట్ బృందం సభ్యులు విచారణను ప్రారంభించారు కూడా. 9 మంది అధికారులు 3 బృందాలుగా విడిపోయి విచారణను వేగవంతం చేస్తున్నారు.సిట్ చీఫ్ గుంటూరు కార్గో ఐ.జి. సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో వచ్చిన అధికారులు విచారణను ముమ్మరం చేశారు.
ప్రాయశ్చిత్త దీక్ష...
మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించారు. దీక్ష విరమణ కోసం ఉపముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి చెంత దీక్షను విరమించనున్నారు డిప్యూటీ సీఎం. రేపు (అక్టోబర్ 1) సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. ఎల్లుండి (అక్టోబర్ 2) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనాంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. క్యూలైన్లను పరిశీలించనున్నారు. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.
ఇవి కూడా చదవండి...
Israel: ఘోరం.. వెయ్యి మంది స్పాట్ డెడ్
Pawan Kalyan: ప్రాయశ్చిత దీక్ష విరమణ కోసం తిరుమలకు పవన్
Read Latest AP News And Telugu News