Home » Deputy CM Pawan Kalyan
Andhrapradesh: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు.
వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు భక్తులకు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు.
ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను సందర్శించారు. అక్కడ కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చట పడగా పవన్ తన కూతురుకు వాటిని కానుకగా అందజేశారు.
జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభాను ప్రకటించారు.
సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్‌లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు.
Andhrapradesh: దేశమంతటికీ 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య ఫలాలు దక్కినా.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు ఆ స్వేచ్చా వాయువులు పీల్చుకోవడానికి మరో 13 నెలలు వేచి చూడాల్సి వచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
విశ్వ విద్యాలయాలను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (X) ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంస్థాగత సాధికారత దిశగా గొప్ప చొరవ తీసుకున్నందుకు నారా లోకేష్‌కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23న ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే.