Share News

AP Govt: మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ అభినందనలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 08:23 PM

విశ్వ విద్యాలయాలను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (X) ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంస్థాగత సాధికారత దిశగా గొప్ప చొరవ తీసుకున్నందుకు నారా లోకేష్‌కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

AP Govt: మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ అభినందనలు

అమరావతి: విశ్వ విద్యాలయాలను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) (X) ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంస్థాగత సాధికారత దిశగా గొప్ప చొరవ తీసుకున్నందుకు నారా లోకేష్‌కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


ALSO READ: Nara Lokesh: జగన్‌కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

గ్రామీణాభివృద్ధిశాఖ ప్రపంచ రికార్డ్....

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పలు మార్పులు చేపట్టడంతో ఈ శాఖ క్రమక్రమంగా మంచి ఫలితాలు రాబడుతోంది.

పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గానూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్‌కు ఎక్కింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే.


ALSO READ: Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం...

పెద్ద ఎత్తున గ్రామ సభలను నిర్వహించడాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను ఈ రోజు (సోమవారం) ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు.

ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభిశృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు వరించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP News: గుణదల సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో పోడియం తొలగింపు పనులు షురూ...

Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు
Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం ...

Read LatestAP News AND Telugu News

Updated Date - Sep 16 , 2024 | 10:19 PM