Share News

Pawan: దుర్గగుడికి పవన్.. మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Sep 24 , 2024 | 09:47 AM

Andhrapradesh: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు.

Pawan: దుర్గగుడికి పవన్.. మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం
Deputy CM Pawan Kalyan

విజయవాడ, సెప్టెంబర్ 24: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి (Kanakadurgamma Temple) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఈరోజు (మంగళవారం) ఉదయం చేరుకున్నారు. తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు దేవదాయ శాఖ కమిషనర్, ఈవో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయ మెట్టను శుద్ధిచేసే కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం మెట్ల పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్ చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు.


తిరుమలకు పవన్..

మరోవైపు అక్టోబర్ 1న పవన్ తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించారు. మెట్ల మార్గాన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.


కాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారం జరిగిపోవడంతో 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షకు ఆయన పూనుకున్నారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ దీక్ష మాలధారణ తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..

Tirumala..టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2024 | 10:30 AM