Home » Deputy CM Pawan Kalyan
తమ ఏన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్వర్క్ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు.
అసెంబ్లీలో బలం లేకున్నా శాసనసభ ప్రజా పద్దుల సంఘం(పీసీఏ)లో సభ్యత్వం కోసం నామినేషన్ వేసిన వైసీపీ.. తీరా పోలింగ్ ముందే చేతులెత్తేసింది.
జగన్ ప్రభుత్వం రూ.13వేల కోట్లు దారి మళ్లించిందని. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పని సరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గురువారం శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు.
కీలకమైన కేసుల్లో అసలేం జరుగుతోంది? గనుల ఘనుడు వెంకటరెడ్డి బెయిలుపై ఎలా బయటికి వచ్చారు?
మరో పదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని, రాబోయే ఐదేళ్లలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల(రూ.8.43 లక్షల కోట్లు)కు చేరుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్స్ మార్చలేకపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రతి గ్రామానికీ రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అందేదని ఆయన చెప్పుకొచ్చారు.