Home » Devineni Umamaheswara Rao
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తాజాగా ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు.
Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానిపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఒక బడుద్దాయి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. గుడివాడలో ‘‘రా కదలిరా’’ బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందన్నారు. 5 వేల కుర్చీల కన్నా ఎక్కువ ఉంటే గుడివాడ వదిలిపెట్టి పారిపోతాను అని గుట్కా, క్యాసినో, గుండాట, సన్నాసి నాని మాట్లాడుతున్నారని టీడీపీ నేత దుయ్యబట్టారు.
విజయవాడ: నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం గొల్లపూడి వన్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శివనాథ్ (చిన్ని), పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కేశినేని నాని, కృష్ణ ప్రసాద్‌పై తెలుగుదేశం సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని మూసుకుని కూర్చున్నారని.. ‘నేను విజయవాడను ఉడదీసా, ఇరగదీసా’ అంటారని ఎద్దేవా చేశారు.
కేశినేని నాని ( Keshineni Nani ) వ్యాఖ్యలకు టీడీపీ నేత దేవినేని ఉమా ( Devineni Uma ) కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ... నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారని చెప్పారు. న
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( YCP MLA Vasantha Krishnaprasad ) అవినీతి చిట్టా మొత్తం కోర్టు, ప్రజల ముందు ఉంచుతానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) హెచ్చరించారు. వసంత కృష్ణప్రసాద్ తనకు పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు.
అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అధికారపార్టీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచేశారని..
అస్తవ్యస్త విధానాలతో ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. సంపద సృష్టి చేతకాక అప్పుల కోసం అడ్డగోలుగా తప్పులు చేశారన్నారు. అదనపు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు.
కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే బహిరంగ సభకు మైలవరం నలుమూలల నుంచి 40 వేల మంది తరలి రాబోతున్నారన్నారు.
ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.