Devineni Uma: ఎన్నికల స్టంట్‌లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు
ABN , Publish Date - Feb 26 , 2024 | 10:43 PM
ఎన్నికల స్టంట్‌లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందని అన్నారు.
అమరావతి: ఎన్నికల స్టంట్‌లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందని అన్నారు. 3 లిఫ్ట్‌ల్లో 2 లిఫ్ట్‌లు టీడీపీ హయాంలో పూర్తి చేయగా మిగిలిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు సమయం పట్టిందా? అని ప్రశ్నించారు.రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం టీడీపీ 5 ఏళ్లల్లో రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.
హంద్రినీవాలో 672 కి.మీ. పనులు చేశానని జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు? అని నిలదీశారు. అవుకు టన్నల్ పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్లిస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని అన్నారు. పరదాలు కట్టుకొని తిరిగే జగన్ రెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. పట్టిసీమను పూర్తి స్థాయిలో వాడి ఉంటే హంద్రీ నీవా ద్వారా కర్నూలు జిల్లా, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరందేదని చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌లను తిట్టడానికే ఇరిగేషన్ మంత్రి ఉన్నారని ఆరోపించారు. దమ్ముంటే ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి ఇవే చిట్టచివరి ఎన్నికలని... ఇంతటితో ఆయన రాజకీయ చరిత్ర ముగిసిపోతుందని దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.