TDP: టికెట్ల టెన్షన్‌లో టీడీపీ సీనియర్లు.. ఇంత మంది ఉన్నారా..?
ABN , Publish Date - Feb 26 , 2024 | 11:40 AM
టీడీపీ సీనియర్లంతా టికెట్ల టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్లను కంగారు పెడుతోంది. పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో యరపతినేని, గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో ఎంఎస్ బేగ్ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గురజాల, పెనమలూరుల్లో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండటం దేవినేని, యరపతినేనిల్లో టెన్షన్ మొదలైంది.
అమరావతి: టీడీపీ-జనసేన రిలీజ్ చేసిన ఉమ్మడి తొలి అభ్యర్థుల జాబితాలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్లు, ముఖ్య నేతల పేర్లు లేవు. దీంతో టీడీపీ (TDP) సీనియర్లంతా టికెట్ల టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే (ఫోన్లు చేసి సర్వే చేయడం) సీనియర్లను కంగారు పెడుతోంది. పెనమలూరులో దేవినేని ఉమామహేశ్వరరావు Devineni Uma), నరసరావుపేటలో యరపతినేని శ్రీనివాస్ (Yarapathineni), గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో ఎంఎస్ బేగ్ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గురజాల, పెనమలూరుల్లో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండటం దేవినేని, యరపతినేనిల్లో టెన్షన్ మొదలైంది. సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో తాజాగా నియోజకవర్గ ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి.
క్లారిటీ లేదే..!
రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో మాజీ మంత్రి సోమిరెడ్డి (Somireddy Chandramohan Reddy) టెన్షన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆనం పేరుతో గతంలోనే మూడు చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించింది. ఆనం పేరుతో వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లల్లో సర్వేలు నిర్వహించడం జరిగింది. తన పేరు ప్రకటించకపోవడంపై ఆందోళనలో కళా వెంకట్రావు (Kala Venkat Rao) ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఎచ్చెర్ల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దెందులూరు నుంచి చింతమనేని (Chinthamaneni)కీ క్లారిటీ రాలేదు.
అయ్యే పనేనా..?
చింతమనేని కుమార్తె పేరుతో దెందులూరులో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది. అనకాపల్లి టికెట్ ఆశించిన పీలా గోవింద్ డైలమాలో ఉన్నారు. మరోవైపు బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanaraya Murthy)కి క్లారిటీ రాలేదు. ఆయన పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. చీపురుపల్లి వెళ్లమని గంటా (Ganta Srinivasarao) కు సూచించారు. భీమిలే కావాలంటూ గంటా పట్టుబడుతున్నారు. ఉంగుటూరు టికెట్ ఆశిస్తోన్న గన్ని వీరాంజనేయులకూ క్లారిటీ రాలేదు. కొవ్వూరు టికెట్ కోసం మాజీ మంత్రి జవహర్ తంటాలు పడుతున్నారు. కాగా.. టికెట్ దక్కని, నియోజకవర్గాల మార్పు విషయమై సీనియర్లు, కీలక నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి క్లారిటీగా చెప్పేశారు. అయినప్పటికీ ఈ టికెట్ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.