TDP-Janasena First List: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు వీరే.. కారణమదేనా..!
ABN , Publish Date - Feb 24 , 2024 | 03:41 PM
TDP-Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.
TDP-Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. తొలి విడతలో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో పార్టీకి చెందిన కీలక నేతల పేర్లు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ లిస్ట్‌లో ఎంతో మంది ముఖ్య నేతల పేర్లు గయాబ్ అయ్యాయి. మరి ఆ నేతలెవరో ఓసారి చూద్దాం..
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావ్, గొరంట్ల బుచ్చయ్య చౌదరి. పీతల సుజాత, సీనియర్ నాయకుడు గౌతు లచ్చన్న రాజకీయ వారసురాలు గౌతు శిరీష పేర్లను టీడీపీ అధినేత ప్రకటించలేదు. వీరితో పాటు చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ, ఆలపాటి రాజ పేర్లను కూడా చంద్రబాబు ప్రకటించలేదు. వీరంతా టీడీపీలో సీనియర్ నేతలుగా, కీలక నాయకులుగా చెలామణి అవుతున్నారు. ఇలాంటి నేతల పేర్లను ఫస్ట్ లిస్ట్‌లో విడుదల చేయకపోవడం ఆ నేతలు కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, పొత్తుల వ్యవహారం కారణంగా ఈ నేతల పేర్లు ప్రకటించడంలో ఆలస్యం అవుతోంది. పొత్తుల అంశం పూర్తిగా కొలిక్కి వచ్చాక వీరి పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు టీడీపీ-జనసేన కూటమిలోని కీలక నేతలు. మరి సెకండ్ లిస్ట్‌నైనా వీరి పేర్లు ఉంటాయా? లేదా? అని చూడాలి.