Home » Devotees
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణిలో 18వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం లభ్యమైంది. కోదండరామాలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కొలనులో పూడికతీత పనులు చేపడుతుండగా ఈ శిలా శాసనం వెలుగుచూసింది.
శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం, అటవీశాఖ భూముల మధ్య సరిహద్దుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రోజుల నుంచి దేవస్థానం పరిధిలో సరిహద్దుల విషయంలో అటవీశాఖ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అందోల్ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అంజన్న జయంతి వేడుకలల్లో భాగంగా భద్రాచలం సీతారాముల దేవస్థానం తరుపున ఈవో రమాదేవి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కళాకారులతో నిర్వహించిన శోభాయాత్రతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది.
తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జూన్ 1న జరిగే హనుమాన్ జయంతి ఉత్సవ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రసిద్ధిగాంచిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, గంగపూజ, కుంకుమార్చన, వస్త్ర, పుష్ప అలంకరణ తదితర పూజలు చేశారు. అనంతరం స్వామి ఉత్సవ మూర్తులను మడుగు తేరులో ప్రతిష్ఠించారు.
అందోల్లో అట్టహసంగా జరుగుతున్న శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami Temple) బ్రహ్మోత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) ఇవాళ(ఆదివారం)హాజరయ్యారు.
పూజలు నిర్వహించడం, రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను(Panchaloha Idols) లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడంతో ఆ పట్టణంలో పండగ వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందోల్(Andole) రంగనాథ స్వామి దేవాలయం(Andole Ranganatha Swami Temple) గురించే మనం మాట్లాడుకునేది.
మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్(uttarakhand)లోని చార్ధామ్ యాత్ర(Chardham Yatra)కు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ప్రాంతాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది మృతుల సంఖ్య కూడా పెరిగింది.