Tulsi Mala : తులసిమాల ధరించడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు, దీనిని ధరించాలంటే నియమాలేంటి..!
ABN , Publish Date - Jun 28 , 2024 | 03:33 PM
తులసిలో శారీరక ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలున్నాయి. తులసి మాల ధరించడం వల్ల రక్తపాటు నియంత్రణలో ఉంటుంది.
తులసి మొక్క మనం నిత్యం పూజించే మొక్క, దీనిని ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ వాకిళ్లలో ఉంచుతారు. పవిత్రమైన మొక్కగా భావించే తులసి మాల ధరించడం చాలా తక్కువ మందిలో చూస్తాం. దీని పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకంగా కృష్ణ పూజ చేసేవారు, లేదా స్వామీజీలు తులసి మాలను ధరిస్తారు. ఇప్పటి రోజుల్లో అంతా తులసిని ధరించడానికి ఇష్టపడుతున్నారు. అయితే తులసి మాలను ఎవరు ధరించాలి. తులసి మాల, తులసి కాండం లేదా వేర్ల నుంచి తయారు చేసిన మాలను ధరించడం ఆధ్యాత్మిక, శరీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. తులసి మాల ధరించడానికి ప్రత్యేకమైన నియమాలున్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.
తులసి మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
తులసి మాల ధరించడం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదల పెరుగుతుంది. ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. ఇది ధరించేవారికి కలిగే హానికర ప్రభావాలనుంచి రక్షణ లభిస్తుంది. తులసి మాల శాంతి, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు.
ఆరోగ్యప్రయోజనాలు..
తులసిలో శారీరక ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలున్నాయి. తులసి మాల ధరించడం వల్ల రక్తపాటు నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసిలో ఉన్న సహజ నూనెలు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.
మెరుగైన దృష్టి..
తులసి మాలతో ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మంత్రాలను పఠిస్తూ పూసలను లెక్కించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా ఏకాగ్రత శ్రద్ధతో ఉండడానికి సహకరిస్తుంది.
Biotin Rich Foods : ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ వీటిని తీసుకుంటే..
ఎమోషనల్ బ్యాలెన్స్..
తులసి మనస్సు, శరీరంపై ప్రశాంతమైన ప్రభావాలను ఇస్తుంది. తులసి మాల ధరించడం భావోద్వేగాలను నిర్వహిస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది.
తులసిని ధరించడానికి నియమాలు..
స్వచ్ఛత, పరిశుభ్రత తులసి మాలను ధరించడానికి అవసరం. నీటితో కడగడం, అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ధరించడం మంచిది కాదు.
Fatty Liver : కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరించే పండ్ల గురించి తెలుసా..!
తులసి మాలను ధరించడానికి ఉదయం సమయం మంచిది. ఉదయాన్నే స్నానం చేసి, రోజువారి ప్రార్థనలో భాగంగా ధ్యానం చేస్తున్నప్పుడు, ఆథ్యాత్మిక అభ్యాసాలను చేస్తున్నప్పుడు దగ్గర ఉంచుకోవడం మంచిది.
ఎప్పుడూ తులసి మాలను భక్తితో ధరించాలి. మాలను ధరించేటప్పుడు రెస్ట్ రూమ్స్, మాంసాహారం, ఆల్కహాల్ తీసుకున్న సమయంలో ధరించకూడదు.
Vegetarian Protein : శాకాహారులు తినేందుకు 7 శాఖాహార ప్రోటీన్ పదార్థాలు ఇవే..!
తులసిమాలను ధరించేటప్పుడు విష్ణువు, కృష్ణుడి మంత్రాలను జపించడం మంచిది. ఆధ్యాత్మిక ప్రయోజనాలను మెరుగుపరుస్తుంది.
తులసి మాల విరిగిపోయినా, అరిగిపోయినా, పాత మాలను పవిత్ర నదిలో నిమజ్జనం చేయవచ్చు. తులసి మాల ఉపయోగంలో లేనప్పుడు కూడా దానిని పచ్చనిచెట్టు మీద వేయవచ్చు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.