Home » Dharani
ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకురావడం, భూముల రీసర్వే, ల్యాండ్ టైటిల్ అమలు, అధికారులకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు,
రికార్డ్ ఆఫ్ రైట్స్-2020(ఆర్వోఆర్) స్థానంలో తెచ్చే తెలంగాణ రికార్డ్స్ రైట్స్ బిల్లు-2024ను లోతుగా అధ్యయనం చేసినట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్లో ప్రాక్టీస్ చేసిన న్యాయవాదిగా తాను, రెవెన్యూ చట్టాలపై అవగాహన కలిగిన వరంగల్, కరీంనగర్ న్యాయవాదులతో కూలంకషంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఓ పెద్దమనిషి, ఓ ఉన్నతాధికారి కలిసి కుట్ర పూరితంగా రాత్రికి రాత్రే ధరణి పోర్టల్ను తీసుకొచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రే తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు భూమి చిక్కులు లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం-2024 తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుంది తెలంగాణ రాష్ట్రంలో ధరణి పరిస్థితి. కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చి ఇక సమస్యలే లేకుండా చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేసింది. పెండింగ్ అప్లికేషన్లను మాత్రం పరిష్కరించడం లేదు.
జక్రాన్పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలో నిర్మించతలపెట్టిన ఫోర్త్ సిటీ వెనుక భారీ భూకుంభకోణం దాగి ఉందని, వేలాది ఎకరాలను దిగమింగి ఆస్తులను కూడబెట్టుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
ధరణి పోర్టల్లో ఇంతకాలం పరిష్కారానికి వీలులేని సమస్యలకు చరమగీతం పాడేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం తీసుకురానున్న ఆర్వోఆర్-2024 ముసాయిదా బిల్లులో పరిష్కార మార్గాలను చూపించనుంది.
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ధరణితో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు.