Home » Dharani
ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యలపై కమిటీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ధరణిలో మొత్తం 119 తప్పలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ పేర్కొంది.
ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. ధరణి దరఖాస్తులకు సంబంధించిన అంతర్గత పరిశీలన పూర్తయినప్పటికీ, ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. ఈ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ఎప్పుడు చేపడుతారోనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది.
బొమ్మరాశి పేటలో కొందరు రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసి భూములను కాజేశారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) ఆరోపించారు. బొమ్మరాశి పేట, శామీర్ పేట మండలంలో 920 ఎకరాల భూముల కుంభకోణం జరిగిందని చెప్పారు. బొమ్మరాశి పేటలో బీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది భూములు ఉన్నాయన్నారు.
తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
Telangana: రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ధరణి కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యింది.
‘ధరణి’లో ఉన్న సమస్యలను అర్ధం చేసుకుంటున్నామని.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ధరణి కన్నా పది రెట్లు ప్రమాదకరం అని బీజేపీ విమర్శిస్తోంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో కుంభకోణాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఆస్తులను ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకోకుంటే 22ఏలో చేర్చే అవకాశం ఉందని వివరించింది.
గత బీఆర్ఎస్(BRS) సర్కార్ ధరణి(Dharani Portal) పేరుతో రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని ధరణి కమిటీ మెంబర్ కోదండ రామిరెడ్డి ఆరోపించారు.
ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటూ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం నలుగురు సభ్యులు ఉన్నారు.
ఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) ధరణిలో ఉన్న భూములను రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ( Madhuyashkigoud ) వ్యాఖ్యానించారు.