Share News

TG news: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:47 PM

జక్రాన్‌పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.

TG news: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

నిజామాబాద్: జక్రాన్‌పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన రైతు రాజేశ్ వ్యవసాయంతోపాటు మరో వ్యాపారం చేశారు. అయితే రెండింటిలోనూ సుమారు రూ.12లక్షలు మేర నష్టపోయాడు. అప్పులు, వాటి వడ్డీలు బాగా పెరిగిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అయితే తనకు ఉన్న రెండెకరాల భూమి అమ్మి అప్పులు తీర్చాలని రైతు ప్రయత్నించాడు.


అయితే అక్కడే రైతుకు మరో సమస్య ఎదురైంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో దాన్ని అమ్మేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన పిల్లలకు ఎలాంటి హానీ తలపెట్టొద్దని ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఆడియో వైరల్‌గా మారింది. ఆడియో విన్న వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన జక్రాన్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Aug 09 , 2024 | 01:47 PM