Home » Dharani
బొమ్మరాశి పేటలో కొందరు రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసి భూములను కాజేశారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) ఆరోపించారు. బొమ్మరాశి పేట, శామీర్ పేట మండలంలో 920 ఎకరాల భూముల కుంభకోణం జరిగిందని చెప్పారు. బొమ్మరాశి పేటలో బీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది భూములు ఉన్నాయన్నారు.
తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
Telangana: రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ధరణి కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యింది.
‘ధరణి’లో ఉన్న సమస్యలను అర్ధం చేసుకుంటున్నామని.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ధరణి కన్నా పది రెట్లు ప్రమాదకరం అని బీజేపీ విమర్శిస్తోంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో కుంభకోణాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఆస్తులను ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకోకుంటే 22ఏలో చేర్చే అవకాశం ఉందని వివరించింది.
గత బీఆర్ఎస్(BRS) సర్కార్ ధరణి(Dharani Portal) పేరుతో రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని ధరణి కమిటీ మెంబర్ కోదండ రామిరెడ్డి ఆరోపించారు.
ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటూ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం నలుగురు సభ్యులు ఉన్నారు.
ఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) ధరణిలో ఉన్న భూములను రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ( Madhuyashkigoud ) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని ( Dharani ) తీసేస్తామని అంటుంది అలా అయితే రైతు బంధు ( RYTHU BANDHU ) ఎలా సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు.గురువారం నాడు ఆదిలాబాద్‌లో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ధరణితో రైతుబంధు ఇస్తున్నాము. రైతులకు సకాలంలో అకౌంట్లలో పైసలు పడుతున్నాయని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైతుందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి విరచుకుపడ్డారు.