Home » Dharmapuri Arvind
Telangana: పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు వస్తదని.. నరేంద్ర మోదీ వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని అన్నారు. దీన్ని నిజామాబాద్ తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బీజేపీ సభలో అర్వింద్ మాట్లాడుతూ.. జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని..
Telangana: నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో అల్పాహారం చేసిన జీవన్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విరుచుకుపడ్డారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్ ఐదు సంవత్సరాలు గడిచినా బోర్డ్ తేలేదని విమర్శించారు.
Telangana: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి. నిజామాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది. క్వింటాల్ పసుపు ధర రూ.20 వేలు దాటింది. గురువారం రైతు మల్లయ్య క్వింటాల్ పసుపును రూ.20,150కు అమ్మాడు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పసుపు ధర రూ.16వేల దాటింది.
Andhrapradesh: మూడోసారి కాదు.. నాలుగో సారి కూడా మోదీనే ప్రధాని అవుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవబోతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వాతావరణం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.
కాంగ్రెస్ నేతలు పసుపు బోర్డుపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) విమర్శించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై అరవింద్ విమర్శలు గుప్పించారు.
లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం రాబోతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) అన్నారు. నిజామాబాద్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా జనవరి 22న ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని కోరారు.
రాష్ట్రంలో బీజేపీ. కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. బలమైన అభ్యర్థి లేని చోటు నుంచి నేను పోటీ చేశాను.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రమైన ఫలితాలను అందిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడటమే షాక్‌ను కలిగిస్తుంటే.. మరోవైపు బీజేపీ కీలక నేతలంతా వెనుకబడిపోతుడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు వెనుకబడిపోయారు.
తెలంగాణ(Telangana) ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.