Home » Digital Arrest Scams
ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల ద్వారా ప్రజల నుంచి డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలా ఈ మధ్య ఎక్కువ కాలంలో వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? డిజిటల్ అరెస్ట్ ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందగలమా? అందుకోసం ఏం చేయాలి..
విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలిని మోసం చేసిన కేసులో పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ నేరగాళ్లు ఈ మధ్య వీడియో కాల్స్ చేసి.. ‘మీరు మనీలాండరింగ్ కుంభకోణంలో ఇరుక్కున్నారు.
‘‘మేము ఈడీ అధికారులం. ఒక కేసులో మీ ప్రమేయం ఉంది. మీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను గుర్తించాం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఫోన్ కట్ చేయకుండా వీడియో కాల్లో మా ఆధినంలో ఉండాలి’’ అంటూ ఫేక్ నోలీసులు పంపిస్తూ మోసగాళ్లు ‘డిజిటల అరెస్ట్’ మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు చెల్లిస్తే కేసు నుంచి తప్పిస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.
ఈ మధ్య కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదొక సైబర్ మోసం. కేటగాళ్లు ప్రభుత్వాధికారులుగా నమ్మించి.. కేసుల్లో ఇరుకున్నట్టుగా అమాయకులను నమ్మిస్తున్నారు. విచారణ పేరిట ఆన్లైన్లో వారి ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు గుంజుతున్నారు. ఈ నేరాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన రిపోర్ట్ షాక్కు గురిచేస్తోంది.