Congress: రెండు వర్గాలుగా చీలి కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:54 PM
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలి ఘర్షణకు దిగారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్‌నాథ్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నే
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలి ఘర్షణకు దిగారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్‌నాథ్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నేతలు ఒకరిపై మరొకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి షహర్యార్ ఖాన్, కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం మాజీ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ మధ్య చెలరేగిన వివాదం.. ఘర్షణకు దారి తీసింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై దిగ్విజయ్ సింగ్‌ని ప్రదీప్ దుర్భాషలాడాడని షహర్వార్ ఖాన్ ఆరోపించడం వివాదానికి కారణమైంది. దీంతో కుర్చీలతో కొట్టుకున్నారు. ఇతర నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. కాగా.. నవంబర్ 17న జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లు పాలించిన బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది.