Share News

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

ABN , Publish Date - Apr 15 , 2025 | 08:37 PM

రామ్‌దేవ్ బాబా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

భోపాల్: యోగా గురు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) 'షరబత్ జిహాద్' (Sharbat Jihad) వ్యాఖ్యలు వివాదంలో చిక్కుకున్నాయి. ఆయన తన వ్యాఖ్యల ద్వారా మతపరమైన విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) భోపాల్‌లోని టీటీ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయసంహితలోని 196(1), 299 సెక్షన్లు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోరారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ


మతం, కులం, భాష, ప్రాంతం ఆధారంగా గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రమోట్ చేయడాన్ని సెక్షన్ 196 నిరోధిస్తుంది. ప్రజల మతపరమైన భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా కించపరచడాన్ని సెక్షన్ 299 అడ్డుకుంటుంది. రామ్‌దేవ్ బాబా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.


రామ్‌దేవ్ తమ పతంజలి గులాబ్ షరబత్ మార్కెటింగ్‌‌ చేస్తూ, మద్రసాలు, మసీదుల నిర్మాణం కోసం ఒక కంపెనీ తమ ఉత్పత్తులు అమ్ముకుంటోందని పేర్కొ్న్నారని, ఆయన 'హందర్ద్ కంపెనీ' గురించి మాట్లాడారనే విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందేనని దిగ్విజయ్ అన్నారు. 'రూహ్ అఫ్జా' షరబత్ యజమాని ఒక ముస్లిం కావడంతోనే రామ్‌దేవ్ ఈ విద్వేష ప్రసంగం చేశారని, 'షరబత్ జిహాద్'గా దానిని పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రామ్‌దేవ్‌ బాబా నేరంపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు. దీనిపై అదనపు పోలీస్ కమిషన్ మాట్లాడుతూ, రామ్‌దేవ్ బాబా మతపరమైన భావాలను దెబ్బతీసినందున ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దిగ్విజయ్ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై దర్యాప్తు జరిపి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు


ఇవి కూడా చదవండి..

Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 15 , 2025 | 08:46 PM