Home » District
టీడీపీ అనంత అర్బన కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ బుధవారం అట్టహాసంగా నామినేషన వేశారు. శ్రీనగర్ కాలనీలోని టీడీపీ కార్యాలయం నుంచి వేలాది మందిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి, మత పెద్దలు దగ్గుబాటిని ఆశీర్వదించారు. కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన నామినేషన ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ నుంచి జడ్పీ కార్యాలయం ...
టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉరవకొండలో పయ్యావుల కేశవ్ బుధవారం నామినేషన వేశారు. తమ స్వగ్రామం కౌకుంట్ల నుంచి కార్యకర్తలతో కలిసి బుధవారం చిన్నముష్టూరు గ్రామ సమీపంలోని కల్లంబండ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అక్కడి నుంచి ఉరవకొండుకు చేరుకుని నామినేషన వేశారు. అనంతరం ఓపెనటా్‌ప వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటూ, కవితా సర్కిల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో...
టీడీపీ కూటమి అభ్యర్థిగా రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు బుధవారం నామినేషన దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వేలాది మందితో రోడ్‌షో నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అంతకు మునుపు కాలవ శ్రీనివాసులు శాంతినగర్‌లోని బన్ని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన రోడ్‌షో మధ్యాహ్నం 2.45 వరకు...
అధికారులు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం అనంత సంకల్పం మెటీరియల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ, జిల్లా పరిషత స్కూళ్లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఇతర యాజమాన్య స్కూళ్ల కంటే అత్యల్ప ఫలితాలు జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లలో వచ్చాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నా యి. ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు డీసీఈబీ ద్వారా మెటీరియల్ తయారు...
రాయలసీమ నీటి ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, జలసాధన సమితి అధ్యక్షుడు రామ్‌కుమార్, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వజ్రకరూరు మండలం రాగులపాడు సమీపంలోని హంద్రీనీవా పంప్‌హౌస్ వద్ద కాలువను మంగళవారం వారు సందర్శించారు. అనంతరం గుంతకల్లు పట్టణంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు
జిల్లాలో సోమవారం నామినేషన్ల జోరు పెరిగింది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎంపీ స్థానానికి పది, అసెంబ్లీ స్థానాలకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ సోమవారం ఒకే రోజు ఎంపీ స్థానానికి ఆరుగురు, 14 అసెంబ్లీ స్థానాలకు 27 మంది నామినేషన దాఖలు చేశారు.
వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన ప్రక్రియలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. నామినేషన కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన అమలులో ఉన్నా.. బేఖాతరు చేశారు. పరిమితి దాటి, పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి నామినేషన వేసేందుకు తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లగా..
అనంతపురం జిల్లా ఎన్నికల మస్కట్‌గా ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ విద్యార్థి ప్రశాంత కుమార్ రూపొందించిన ‘వేరుశనగ’ ఆకృతి ఎంపికైంది. రాష్ట్రంలోనే మొట్టమొదట ఎన్నికల మస్కట్‌ను రూపొందించిన జిల్లాగా అనంతకు ఖ్యాతి దక్కిందని కలెక్టరు వినోద్‌కుమార్ తెలిపారు. ఎన్నికల మస్కట్ ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మస్కట్‌లు వచ్చాయి.
మండల పరిధిలోని వెంకటంపల్లిలో టీడీపీ కార్యకర్త గోవిందుపై వైసీపీ నాయకులు సోమవారం దాడి చేశారు. టీ స్టాల్ వద్ద ఉన్న తనపై వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి అనూహ్యంగా కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు
ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో జగనరెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గంలో మూడు హామీలను ఇచ్చి ఇప్పటికీ తీర్చకపోవడంపై జనం పెదవి విరుస్తున్నారు. వాటిలో ముఖ్యంగా భైరవానతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను మళ్లిస్తామని, తుంగభద్ర ఎగువకాలువను ఆధునికీకరిస్తామని, బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు వద్ద నేమకల్లు ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని హామీలు గుప్పించారు.