Share News

NOMINATIONS : నామినేషన్ల జోరు

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:44 AM

జిల్లాలో సోమవారం నామినేషన్ల జోరు పెరిగింది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎంపీ స్థానానికి పది, అసెంబ్లీ స్థానాలకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ సోమవారం ఒకే రోజు ఎంపీ స్థానానికి ఆరుగురు, 14 అసెంబ్లీ స్థానాలకు 27 మంది నామినేషన దాఖలు చేశారు.

NOMINATIONS : నామినేషన్ల జోరు
Ambika Lakshminarayana presenting the nomination papers to the Collector

ఎంపీ స్థానానికి ఆరుగురు.. ఎమ్మెల్యే స్థానాలకు 49 మంది..

టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబికా నామినేషన..

రాయదుర్గంలో కాలవ, గుంతకల్లులో జయరాం..

కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు..

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 22: జిల్లాలో సోమవారం నామినేషన్ల జోరు పెరిగింది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎంపీ స్థానానికి పది, అసెంబ్లీ స్థానాలకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ సోమవారం ఒకే రోజు ఎంపీ స్థానానికి ఆరుగురు, 14 అసెంబ్లీ స్థానాలకు 27 మంది నామినేషన దాఖలు చేశారు.


- అనంతపురం పార్లమెంటు స్థానానికి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ తన నామినేషన పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌కు అందజేశారు. వైసీపీ అభ్యర్థి శంకరనారాయణ, ఆయన సోదరుడు మాలగుండ్ల రవీంద్ర నామినేషన దాఖలు చేశారు. స్వతంత్రులుగా వడ్ల కేశవయ్య, జీవీ రమణారెడ్డి, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున చిన్న వెంకటసుబ్బయ్య నామినేషన దాఖలు చేశారు.

- కళ్యాణదుర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నామినేషన వేశారు. ఆయన తరఫున ఆయన భార్య రమాదేవి మరో నామినేషన వేశారు.

- ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి నామినేషన దాఖలు చేశారు. తనపై ఒక క్రిమినల్‌ కేసు ఉందని, గతంలో రెండు కేసుల్లో శిక్ష పడిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

- తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి తరఫున కంచం రాంమోహనరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి రమాదేవి నామినేషన దాఖలు చేశారు. బీఎస్పీ తరపున నాగసుబ్బరాయుడు, స్వతంత్రులుగా సోమశేఖర్‌నాయుడు, రాంమోహన, నాగరాజు, బింగి ప్రసాద్‌, కాంగ్రెస్‌ తరఫున గుజ్జల నాగిరెడ్డి నామినేషన వేశారు.

- శింగనమలలో వైసీపీ తరఫున ఎం.చిన్న పెద్దన్న, జైభీంపార్టీ తరఫున ఆనంద్‌ కూమార్‌, ఆల్‌ ఇండియా ప్రజాసేవ హక్కుల పోరాట సమితి పార్టీ తరఫున మాధవ్‌, స్వతంత్రుడిగా దండువారిపల్లి రామాంజినేయులు


నామినేషన వేశారు.

- రాప్తాడులో స్వతంత్రులు సాకే రాజే్‌షకుమార్‌, రవికుమార్‌, బీఎస్పీ తరఫున పెద్ద మల్లప్ప నామినేషన వేశారు.

- రాయదుర్గంలో టీడీపీ తరఫున కాలవ శ్రీనివాసులు, వైసీపీ తరఫున మెట్టు గోవిందరెడ్డిల నామినేషన్లు దాఖలు చేశారు.

- గుంతకల్లులో వైసీపీ తరఫున వెంకటరామిరెడ్డి సతీమణి వై.శారద, కాంగ్రెస్‌ తరఫున దౌల్తాపురం కె.ప్రభాకర్‌, బీఎస్పీ తరఫున షేక్‌ అబ్దుల్‌ మాలిక్‌ నామినేషన వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆరుణమ్మ నామినేషన వేశారు.

- అనంతపురం అర్బనలో వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి వేర్వేరుగా 2 సెట్లు నామినేషన దాఖలు చేశారు. ఇండిపెండ్‌ అభ్యర్థిగా షేక్‌ మసూద్‌వలి నామినేషన దాఖలు చేశారు. సీపీఐ అభ్యర్థిగా జాఫర్‌ తరుపున సిరిగిరి నారాయణస్వామి నామినేషన దాఖలు చేశారు.


జయరాం నామినేషన

గుంతకల్లులో టీడీపీ తరఫున గుమ్మనూరు జయరాం అట్టహాసంగా నామినేషన వేశారు. పాత గుంతకల్లు నుంచి వేలాది మంది నాయకులు, కార్యర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మస్తాన వలి దర్గాలో పూజలు నిర్వహించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు, నాయకులు శ్రీనాథ్‌గౌడు, వెంకట శివుడుయాదవ్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 23 , 2024 | 12:44 AM