PAYYAVULA KESHAV : ఉరవకొండ జనసంద్రం
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:06 AM
టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉరవకొండలో పయ్యావుల కేశవ్ బుధవారం నామినేషన వేశారు. తమ స్వగ్రామం కౌకుంట్ల నుంచి కార్యకర్తలతో కలిసి బుధవారం చిన్నముష్టూరు గ్రామ సమీపంలోని కల్లంబండ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అక్కడి నుంచి ఉరవకొండుకు చేరుకుని నామినేషన వేశారు. అనంతరం ఓపెనటా్‌ప వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటూ, కవితా సర్కిల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో...
టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన..
ర్యాలీకి ఇసుకేస్తే రాలనంత జనం
ఉరవకొండ, ఏప్రిల్ 24: టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉరవకొండలో పయ్యావుల కేశవ్ బుధవారం నామినేషన వేశారు. తమ స్వగ్రామం కౌకుంట్ల నుంచి కార్యకర్తలతో కలిసి బుధవారం చిన్నముష్టూరు గ్రామ సమీపంలోని కల్లంబండ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అక్కడి నుంచి ఉరవకొండుకు చేరుకుని నామినేషన వేశారు. అనంతరం ఓపెనటా్‌ప వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటూ, కవితా సర్కిల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో 30 వేల మందికి పైగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. గుంతకల్లు-ఉరవకొండ ప్రధాన రహదారి కిక్కిరిసింది. రోడ్లన్నీ పసుపుమయంగా మారాయి.
అరాచక ప్రభుత్వాన్ని తరిమికొడదాం..
అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పయ్యావుల కేశవ్ అన్నారు. తనపై 30 ఏళ్లుగా ఆదరాభిమానాలు చూపుతున్న ప్రజలకు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నామినేషనకు తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే ఎన్నికల ఫలితాలు ఉరవకొండలో ముందే వచ్చాయనిపిస్తోందిన అన్నారు. రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణం ప్రజల ఆశీర్వాదమేనని అన్నారు. ఉరవకొండలో అభివృద్ధి జరిగిందంటే అది టీడీపీ హయాంలోనే అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో విశ్వేశ్వరరెడ్డి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని సవాలు విసిరారు. అసమర్థుడైన వ్యక్తికి ఓటేస్తే తినే అన్నంలో మట్టి వేసుకున్నట్లేనని అన్నారు.
రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 1994 ఎన్నికల ఫలితాలు 2024లో పునరావృతం కావడం ఖాయమని అన్నారు. సూపర్‌సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కాలువలకు నీళ్లు ఇచ్చేందుకు తాను లష్కర్‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయులు విక్రమ్‌సింహా, విజయ్‌సింహా, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్ చౌదరి, నాయకులు డి.పురుషోత్తం, ప్రతా్‌పనాయుడు, మండల కన్వీనర్ విజయభాస్కర్, బీడీ మారయ్య, నూతేటి వెంకటేష్, టీడీపీ నాయకులు రామాంజినేయులు, తిమ్మప్ప, కూటమి నాయకులు కొనకొండ్ల రాజేష్, గౌతమ్, లక్ష్మినారాయణ, పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....