Home » District
సామాజిక భద్రత పింఛన్లను తీసుకువచ్చిందే టీడీపీ అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వెంకటాపురంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో నెలకు రూ.35 చొప్పున పింఛన అందించడం ప్రారంభించారని, దానిని ఈ రోజు రూ.4 వేలకు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందనని అన్నారు. రూ.35 ఉన్న పింఛనను రూ.75కు పెంచింది చంద్రబాబేనని, 2004లో వైఎస్సార్ రూ.200 ఇస్తానని రూ.25 మాత్రమే పెంచారని గుర్తు చేశారు. 2014 జూన 8న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా
జిల్లాలో అతిసార విజృంభిస్తోంది. వాంతులు, విరేచనాలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అపరిశుభ్రతే దీనికి ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమౌతోంది. పారిశుధ్య నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో పలువురు ఆస్పత్రులపాలవుతున్నారు. కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం టౌనలో వంద మందికి పైగా అతిసార బాధితులు ఉన్నారు. కళ్యాణదుర్గం సీహెచసీలో రోజుకు సగటున పది మంది అతిసార చికిత్స ...
బుక్కరాయసముద్రం తహసీల్దారు కార్యాలయ సమీపంలో నిలిపిన ఓ బైక్‌లో పాము దూరింది. కార్యాలయంలో పని నిమిత్తం వచ్చిన శివరాం అనే వ్యక్తి.. తన బైక్‌ను పార్కింగ్ చేసి.. తెలిసినవారితో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఓ పాము అతడి బైక్‌లోకి దూరింది. గమనించిన శివరాంతోపాటు అక్కడున్నవారు పామును ...
జిల్లావ్యాప్తంగా 12 వేల క్లస్టర్లలో పింఛన పంపిణీ మ్యాపింగ్ పూర్తి చేశామని, ఒకటో తేదీన ఇంటి వద్దనే లబ్ధిదారులకు సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్‌డీఏ-వైకేపీ పీడీ ఈశ్వరయ్య తెలిపారు. తన చాంబర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పింఛన పెంచారని, పెంచిన పింఛనతో పాటు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన) బాకియి మొత్తాన్ని ఒకటో తేదీన ఇంటివద్దనే అందజేస్తామని తెలిపారు. జూలై నెలకు 2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్లు మొత్తాన్ని జిల్లాకు ...
పెంచిన పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్ నీరబ్ కుమార్ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 2,87,032 మంది లబ్ధిదారులకు జూలై నెలలో పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.195.70...
జిల్లాలో అతిసార ప్రబలుతూనే ఉంది. రోజూ ఏదో ఒక చోట కొత్త కేసులు బయట పడుతున్నాయి. బాధితులు చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. పరిస్థితినిబట్టి వారికి ఎఫ్‌ఎమ్ వార్డు, ఎంఎం వార్డు, చిల్డ్రన వార్డు, జీఈ వార్డు, ఏఎంసీలో చికిత్స చేస్తున్నారు. ఐదారు రోజులుగా దాదాపు 80 మంది జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వీరిలో పలువురు కోలుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో బుధవారం నాటికి 37 మంది అతిసార బాధితులు అడ్మిషనలో ఉన్నారు. దీంతో కేసులు తగ్గుముఖం పట్టాయని భావించారు. కానీ గురువారం ఒక్కరోజే మరో 23 అతిసార కేసులు జిల్లా ఆస్ప...
ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు వేసిన రోడ్డు పాడై పోతోంది. దీన్ని చూసిన ప్రజలు అబ్బా ఎంత నాణ్యతగా రోడ్డు వేస్తున్నారో.. అంటూ నిట్టూరుస్తున్నారు. ఇదీ కూడేరు నుంచి మరుట్ల రెండో కాలనీ వరకు జరుగుతున్న రహదారి పనుల దుస్థితి. పంచాయతీరాజ్‌కు చెందిన ఈ రోడ్డు నిర్మాణ పనుల (14.1కి.మీ)ను రూ.6.4కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టారు. ఎన్నికలు వస్తున్నాయన్న హడావుడిలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మార్చి 18న పనులను ప్రారంభించారు. కూడేరు నుంచి అంతరగంగ, ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కల్లగళ్ల,
నగరంలోని హెచ్చెల్సీ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయం వ్యవహారంపై నగరపాలిక టౌన ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ప్లాన అప్రూవల్ లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారనే కారణం చూపుతూ శనివారం నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకున్నా.. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో అధికారులు స్పందించలేదు. నగరపాలిక కమిషనర్ మేఘ స్వరూప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మారుతి హరిప్రసాద్ శనివారం సాయంత్రం 5 గంటలకు నోటీసులు ఇచ్చారు. ...
గత ప్రభుత్వ పాలనలో జిల్లా గృహ నిర్మాణశాఖలో భారీగా అవినీతి జరిగిందనే ప్రచారం జోరందుకుంది. ఇల్లు మంజూరు నుంచి ఇసుక, సిమెంట్ తదితర సామగ్రి సరఫరాతో పాటు బిల్లులు మంజూరులో సైతం పెద్దఎత్తున అవినీతి జరిగిందనే చర్చ ఆ శాఖలో సాగుతోంది. ఈ వ్యవహారంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు ఆశాఖ పీడీ, ఇద్దరు డీఈఈలు(వీరిలో ఒకరు ఈఈ ఇనచార్జిగా, మరొకరు ఏఈగా పనిచేశారు), వీరితో పాటు రాప్తాడుకు చెందిన మరో ఏఈ పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్ని నెలలు కింద ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జిల్లా ...
కూలీలకు అందాల్సిన ఉపాధి సొమ్మును కొందరు స్వార్థపరులు బోగస్ మస్టర్ల ద్వారా తమ జేబుల్లో వేసుకున్నారు. జిల్లాలోని జాబ్‌కార్డులు, కూలీల ఆధారంగా 2 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాకు 90లక్షలు పనిదినాలు మాత్రమే కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 61.30లక్షలు పనిదినాలు పూర్తి చేశారు. ఇందులో బోగస్ మస్టర్ల ద్వారా సుమారు 5లక్షల పనిదినాలు నమోదు చేసినట్లు సమాచారం. ఒక్కో పనిదినానికి రూ.220 చొప్పున 5 లక్షల పనిదినాలకు రూ.11కోట్లను ఉపాధి సిబ్బంది, గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు ...