Share News

Diarrhea : ఇంకో 23 కేసులు

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:21 AM

జిల్లాలో అతిసార ప్రబలుతూనే ఉంది. రోజూ ఏదో ఒక చోట కొత్త కేసులు బయట పడుతున్నాయి. బాధితులు చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. పరిస్థితినిబట్టి వారికి ఎఫ్‌ఎమ్‌ వార్డు, ఎంఎం వార్డు, చిల్డ్రన వార్డు, జీఈ వార్డు, ఏఎంసీలో చికిత్స చేస్తున్నారు. ఐదారు రోజులుగా దాదాపు 80 మంది జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వీరిలో పలువురు కోలుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో బుధవారం నాటికి 37 మంది అతిసార బాధితులు అడ్మిషనలో ఉన్నారు. దీంతో కేసులు తగ్గుముఖం పట్టాయని భావించారు. కానీ గురువారం ఒక్కరోజే మరో 23 అతిసార కేసులు జిల్లా ఆస్ప...

Diarrhea : ఇంకో 23 కేసులు
District Food Safety Officer Taslim talking to medical staff at Gurukula School in Rajapuram

ఆందోళన కలిగిస్తున్న అతిసార

అనంతపురం టౌన, జూన 27: జిల్లాలో అతిసార ప్రబలుతూనే ఉంది. రోజూ ఏదో ఒక చోట కొత్త కేసులు బయట పడుతున్నాయి. బాధితులు చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. పరిస్థితినిబట్టి వారికి ఎఫ్‌ఎమ్‌ వార్డు, ఎంఎం వార్డు, చిల్డ్రన వార్డు, జీఈ వార్డు, ఏఎంసీలో చికిత్స చేస్తున్నారు. ఐదారు రోజులుగా దాదాపు 80 మంది జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వీరిలో పలువురు కోలుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో బుధవారం నాటికి 37 మంది అతిసార బాధితులు అడ్మిషనలో ఉన్నారు. దీంతో కేసులు తగ్గుముఖం పట్టాయని


భావించారు. కానీ గురువారం ఒక్కరోజే మరో 23 అతిసార కేసులు జిల్లా ఆస్పత్రికి వచ్చాయి. ప్రస్తుతం 60 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో అర్బన ప్రాంతాలవారు 34 మంది, గ్రామీణ ప్రాంతాలవారు 24 మంది ఉన్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈఎనటీ విభాగంలో 16 పడకలతో అతిసార కేసుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి, అక్కడ కూడా చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.

గురుకుల పాఠశాల తనిఖీ..

గుత్తి మండలం రజాపురం సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలను జిల్లా ఆహార భద్రతా అధికారి తస్లీం గురువారం తనిఖీ చేశారు. కలుషిత ఆహారం, నీటి కారణంగా పదుల సంఖ్యలో బాలికలు వాంతులు, విరేచనాలతో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలలోని ఆహార పదార్థాలు, తాగునీరు సరుకులను ఆమె తనిఖీ చేశారు. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌, వైద్య సిబ్బందితో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

నివేదిక ఇవ్వండి: మంత్రి కేశవ్‌

ఉరవకొండ: మండల పరిధిలోని చిన్నముష్టూరులో అతిసారతో వృద్ధుడు మృతిచెందిన ఘటన, గుత్తి మండలం రజాపురంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో బాలికల అస్వస్థతపై విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆదేశించారు. అతిసార ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మంగళగిరి నుంచి ఆయన కలెక్టర్‌తో ఫోనలో మాట్లాడారు.


మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 28 , 2024 | 12:21 AM