Home » District
రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిత్య శాఖలు పయ్యావుల కేశవ్‌కు దక్కడంతో జిల్లాలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ కీలక భూమిక పోషించనున్నారనడంలో సందేహం లేదు. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే కరువు జిల్లా అనంతకు దక్కిన అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా చరిత్ర లో ఎంతోమంది మంత్రులుగా పనిచేసినా జిల్లాకు ఆర్థికశాఖ దక్కలేదు. ఆ అరుదైన అవకాశాన్ని పయ్యావుల కేశవ్ దక్కించుకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ...
రక్తమిచ్చి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడగలిగిన రక్తదాత నిజమైన హీరో అని జిల్లా కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక పాతూరు సీడీ ఆస్పత్రిలో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాల నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు అందజేసి, సత్కరించారు. అనంతరం వేడుకలనుద్దేశించి కలెక్టరు మాట్లాడుతూ.. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు హిరోనే అన్నారు. జిల్లాలోని ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని ...
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో తమకు మంచి రోజులు వస్తాయని భవన నిర్మాణ కార్మికులు ఎదురు చూస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతకు ముందు ప్రభుత్వాలు కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు స్వస్తి పలికింది. కార్మికుల పొట్ట కొడుతూ కార్మిక సంక్షేమ శాఖ నిధులను సైతం ఇతర పథకాలకు మళ్లించారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు కార్మిక సంక్షేమశాఖ ద్వారా 2019 వరకూ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేశాయి. టీడీపీ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు భవన నిర్మాణ కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కూడా సంక్షేమ పథకాలనూ ...
ఈసారి ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో మిరప రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది మిరప రైతును నల్లి పురుగు, కాలర్ రాట్ వంటి తెగుళ్లు భయపెట్టి నష్టాలు పాలు చేశాయి. గత నష్టాలు కుంగదీస్తున్నా రైతులు మరోసారి మిరపను సాగు చేసే సాహసానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సాగునీరు అందించి రైతులను ఆదుకుంటాడనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. జూన చివరి వారం, జూలై మొదటి వారంలో మిరప సాగు మొదలవుతుంది. గత ఏడాది మొదట్లో వర్షాలు బాగానే వచ్చాయి. కాపు పట్టే ...
జిల్లాలో ఇరిగేషన శాఖలకు చెందిన అధికారులు ప్రణాళికతో అప్రమత్తంగా పనిచేయాలని, ప్రతినెలా ఇంజనీర్ టూర్ డైరీ అందించాలని కలెక్టరు వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో హెచఎ్‌సఎ్‌సఎ్‌స, హెచఎల్‌సీ, ఇతర మైనర్ ఇరిగేషన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచఎనఎ్‌సఎ్‌స, హెచఎల్‌సీ, మైనర్ ఇరిగేషన ఎస్‌ఈలు ప్రతినెలా తప్పకుండా ప్రధాన కార్యాలయాలకు వెళ్లాలని, అక్కడ జిల్లా సమస్యలు తెలుసుకొని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ప్రాజెక్టులు, కాలువల వివరాలు పూర్తీగా ...
ఒకప్పుడు ‘మీ ఊరికి ఏం కావాలి’ అని ఏ మంత్రో, నాయకుడో అడిగితే... పిల్లోళ్ల్లు చదువుకోడానికి ‘ఊరిబడి’ కావాలని కోరేవారు. గుడి కన్నా బడే ముఖ్యమని నమ్మేవాళ్లు. ఊళ్లో బడి ఉంటే పిల్లలు బడిబాట పడతారని, చదువుకుని బాగుపడతారన్నది పెద్దల నమ్మకం. కిలోమీటర్ల దూరం నడవకుండా ఊరిలో ఉండే బడికి పిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్తారని దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి ప్రాథమిక పాఠశాలలను 2019-2024 మధ్య ఉన్న జగనరెడ్డి ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చేసింది. 117 జీవో ...
వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన 12 నుంచి తరగతులు పునఃప్రారంభమౌతాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఒక్కరోజు అదనపు సెలవు వచ్చింది. 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత, మున్సిపల్, అన ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్.. ఇలా అన్ని యాజమాన్యాల్లో 2,423 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,81,091 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ...
జిల్లాలోని 20 మండలాల్లో శనివారం రాత్రి వర్షం పడింది. అత్యధికంగా గుంతకల్లులో 22.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. యాడికి 18.2, ఉరవకొండ 15.8, పామిడి 15.4, బెళుగుప్ప 14.2, తాడిపత్రి 12.2, గార్లదిన్నె 9.4, ...
హెచ్చెల్సీ నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. నగరంలోని తన స్వగృహంలో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్, ఈఈ రమణారెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ నాగులాపురం వద్ద బలహీనంగా మారిందని, అక్కడ తక్షణం మరమ్మతులు చేయాలని అన్నారు. హెచ్చెల్సీ పొడవునా అనేక వంతెనలు దెబ్బతిన్నాయని, దర్గా హోన్నూరు, గంగలాపురం, గరుడచేడు తదితర ప్రాంతాల్లో వంతెనలు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్చెల్సీలో ...
అనంత నగరపాలికలో హడావుడిగా రూ.7 కోట్ల బిల్లు చేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో బిల్లులు ఆగిపోతాయనే భయంతో గుట్టుగా వ్యవహారం నడపాలని ప్రయత్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఉన్నతాధికారులకు తెలియడంతో బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలంలో కొన్ని అడ్డగోలు పనులకు సైతం బిల్లులు చేశారు. ప్రభుత్వ పథకాల ప్రచార ...