KALAVA SRINIVAS : నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడండి
ABN , Publish Date - Jun 09 , 2024 | 12:00 AM
హెచ్చెల్సీ నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. నగరంలోని తన స్వగృహంలో హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ రమణారెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ నాగులాపురం వద్ద బలహీనంగా మారిందని, అక్కడ తక్షణం మరమ్మతులు చేయాలని అన్నారు. హెచ్చెల్సీ పొడవునా అనేక వంతెనలు దెబ్బతిన్నాయని, దర్గా హోన్నూరు, గంగలాపురం, గరుడచేడు తదితర ప్రాంతాల్లో వంతెనలు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్చెల్సీలో ...
హెచ్చెల్సీ అధికారులకు ఎమ్మెల్యే కాలవ సూచన
అనంతపురం అర్బన, జూన 8: హెచ్చెల్సీ నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. నగరంలోని తన స్వగృహంలో హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ రమణారెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ నాగులాపురం వద్ద బలహీనంగా మారిందని, అక్కడ తక్షణం మరమ్మతులు చేయాలని అన్నారు. హెచ్చెల్సీ పొడవునా అనేక వంతెనలు దెబ్బతిన్నాయని, దర్గా హోన్నూరు, గంగలాపురం, గరుడచేడు తదితర ప్రాంతాల్లో వంతెనలు కూలిపోవడంతో
రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్చెల్సీలో నీటి సరఫరాకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెలాఖరులో తుంగభద్ర జలాశయం నుంచి నీటి సరఫరా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, యుద్ధప్రాతిపదికగా మరమ్మతులు చేయాలని అన్నారు. కాలువలకు రెండు చోట్ల తక్షణ మరమ్మతుల కోసం రూ.60 లక్షలు అవసరమని అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామని కాలవ అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....