Share News

Municipal Corporation : రూ.7 కోట్లకు ఎసరు..?

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:19 AM

అనంత నగరపాలికలో హడావుడిగా రూ.7 కోట్ల బిల్లు చేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో బిల్లులు ఆగిపోతాయనే భయంతో గుట్టుగా వ్యవహారం నడపాలని ప్రయత్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఉన్నతాధికారులకు తెలియడంతో బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలంలో కొన్ని అడ్డగోలు పనులకు సైతం బిల్లులు చేశారు. ప్రభుత్వ పథకాల ప్రచార ...

Municipal Corporation : రూ.7 కోట్లకు ఎసరు..?

నగరపాలికలో హడావుడిగా బిల్లులు

అనంతపురం క్రైం, జూన 7: అనంత నగరపాలికలో హడావుడిగా రూ.7 కోట్ల బిల్లు చేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో బిల్లులు ఆగిపోతాయనే భయంతో గుట్టుగా వ్యవహారం నడపాలని ప్రయత్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఉన్నతాధికారులకు తెలియడంతో బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలంలో కొన్ని అడ్డగోలు పనులకు సైతం బిల్లులు చేశారు. ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాలకు సైతం రూ.10లక్షల చొప్పున బిల్లులు పెట్టారు. కొన్ని పనులను


సగం పూర్తి చేసి వదిలేశారు. కొన్నింటిని నాసిరకంగా చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ కూటమి అధికారం చేపట్టనుంది. దీంతో నగరపాలికలోని కొందరు కాంట్రాక్టర్లు, నాయకులు తమ బిల్లులను పాస్‌ చేయించుకోవాలని చూస్తున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు చెక్కులు ఇచ్చే పరిస్థితులు లేవు. ప్రతి బిల్లూ సీఎ్‌ఫఎంఎ్‌సలోకి వెళ్లాల్సిందే. దీంతో తమకు అనుకూలంగా ఉన్న ఇంజనీరింగ్‌ విభాగం సిబ్బందితో ఆ బిల్లుల ఫైల్స్‌ను పైకి పంపేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో తాత్కాలికంగా బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 08 , 2024 | 12:31 AM