Home » DMK
తమిళనాడులో ఎట్టకేలకు డీఎంకే, కాంగ్రెస్ మధ్య లోక్సభ ఎన్నికల కోసం సీట్ల ఒప్పందం కొలిక్కి వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీని (PM Narendra Modi) ఉద్దేశిస్తూ తమిళనాడు మంత్రి అన్బరసన్ (DMK Minister Anbarasan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిని కాకపోయి ఉంటే, ప్రధానిని ముక్కలు ముక్కలుగా నరికేవాడినంటూ కుండబద్దలు కొట్టారు. ఎంతోమంది ప్రధానమంత్రుల్ని చూశానని, కానీ మోదీలా దిగజారుడు మాటలు మాట్లాడే పీఎంని చూడలేదని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు మక్కల్ నీది మయ్యం కట్చి అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు.
ఏ కూటమిలో చేరినా ఓటమి ఖాయమనే భయంతోనే మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్(Kamala Haasan) అవినీతి అక్రమాలకు నెలవైన డీఎంకే కూటమిలో చేరి ఆ పార్టీ అవినీతికి గట్టి మద్దతు ప్రకటించారని కేంద్రమంత్రి ఎల్.మురుగన్(Union Minister L. Murugan) విమర్శించారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నాయకుల కోసం వాణిజ్య నగరమైన కోయంబత్తూరులో సకల సదుపాయాలతో హైటెక్ ప్రచార వాహనాలు తయారవుతున్నాయి.
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేంద్రప్రభుత్వం సిలిండర్ ధర తగ్గించిందని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విమర్శించారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ సినీ నటుడు కమలహాసన్(Kamala Haasan) నాయకత్వంలోని మక్కల్ నీదిమయ్యం పార్టీ డీఎంకే కూటమిలో స్థానం మాత్రమే సంపాదించుకుంది.
తమిళనాడులో మరోసారి 2019 సీట్ల షేరింగ్ ఫార్ములా పునరావృతమైంది. లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఖరారైంది. కాంగ్రెస్కు తమిళనాడులో 9 సీట్లు, పొరుగున ఉన్న పుదుచ్చేరిలో ఒక సీటును డీఎంకే కేటాయించింది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు లోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో పొత్తులు దాదాపు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల డీల్ శని, ఆదివారాల్లో ఖరారు కావచ్చు. కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు జరిగితే 9+1 సీట్లు ఆ పార్టీకి ఖాయమయ్యే అవకాశాలున్నాయి.
లోక్సభ ఎన్నికల వేళ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో కమల్ పార్టీ 'మక్కల్ నీథి మయ్యం' శనివారంనాడు చేరింది.