Share News

LS polls: కాంగ్రెస్‌కు 9+1, ఒకట్రెండు రోజుల్లో ఖరారు

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:11 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు లోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో పొత్తులు దాదాపు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్‌-డీఎంకే మధ్య సీట్ల డీల్ శని, ఆదివారాల్లో ఖరారు కావచ్చు. కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు జరిగితే 9+1 సీట్లు ఆ పార్టీకి ఖాయమయ్యే అవకాశాలున్నాయి.

LS polls: కాంగ్రెస్‌కు 9+1, ఒకట్రెండు రోజుల్లో ఖరారు

చెన్నై: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha polls) సమీపిస్తుండటంతో తమిళనాడు (Tamilnadu) లోని అధికార డీఎంకే (DMK) సారథ్యంలోని కూటమిలో పొత్తులు దాదాపు కొలిక్కి వచ్చాయి. చిన్న చిన్న భాగస్వామ్య పార్టీలకు సీట్లను డీఎంకే ఇప్పటికే ఖరారు చేయగా, కాంగ్రెస్‌-డీఎంకే (Congress-DMK) మధ్య సీట్ల డీల్ శని, ఆదివారాల్లో ఖరారు కావచ్చని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు జరిగితే 9+1 సీట్లు ఆ పార్టీకి ఖాయమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సీట్ల ఖరారుపై చర్చలు జరుగుతున్నాయని, మరి కొద్ది గంటల్లోనే అధికార ప్రకటన ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.


పొత్తుల్లో భాగంగా ఎండీఎంకే, ఐయూఎంఎల్, కేఎండీకే‌లకు ఇప్పటికే ఒక్కో లోక్‌సభ స్థానాన్ని డీఎంకే కేటాయించింది. ఎండీఎంకే, ఐయూఎంఎల్ తమ తమ గుర్తులతో పోటీ చేయనుండగా, కేఎండీఎంకే మాత్రం డీఎంకే గుర్తుపై పోటీకి దిగనుంది. చర్చల్లో కుదరినట్టు చెబుతున్న ఏకాభిప్రాయం ప్రకారం, సీపీఐ, సీపీఎం, విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే)లు తలో రెండు సీట్లలో తమ పార్టీ గుర్తులతో పోటీచేయనున్నారు.


కాంగ్రెస్ వాటా...

పొత్తులో భాగంగా 9+1 సీట్లను ( తమిళనాడులో 9, పుదుచ్చేరిలో 1) కాంగ్రెస్ ఆశిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ మధ్య షీట్ల షేర్ సమానంగా ఉంది. అధికార కూటమి 39 లోక్‌సభ స్థానాల్లో 38 గెలుచుకుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లు గెలిచింది

Updated Date - Mar 09 , 2024 | 03:11 PM