Home » DMK
డీఎంకే కూటమిలో రెండు సీట్ల కోసం పట్టుబట్టిన ఎండీఎంకే(MDMK) చివరకు ఒక స్థానానికే సరిపెట్టుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం డీఎంకే(DMK) ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.
ప్రధాని మోదీ రోజూ రాష్ట్రానికి వచ్చినా, ఇక్కడే ఇల్లు తీసుకొని బస చేసినా బీజేపీకి రాష్ట్రప్రజలు ఓటు వేయ్యరని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.
ఇండియా ఒక దేశం కాదని, ఇదొక ఉప ఖండమని డీఎంకే సీనియర్ నేత ఎ.రాజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యాఖ్యలతో 100 శాతం ఏకీభవించమని తెలిపింది. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడాలని హితవు పలికింది.
భారతదేశంపై డీఎంకే ఎంపీ ఏ రాజా (DMK MP A Raja) చేసిన సంచలన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా (Amit Malviya) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా బాల్కనైజేషన్ (Balkanisation) (ఒక దేశాన్ని స్వతంత్ర రాష్ట్రాలుగా విడగొట్టడం) కోసం పిలుపునిచ్చారని.. శ్రీరాముడ్ని కూడా అవమానించారని మండిపడ్డారు.
డీఎంకే నాశనాన్ని కోరుకున్నవారంతా పత్తాలేకుండా పోయారని ఆ పార్టీ ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చారు. తిరునెల్వేలి బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తూ డీఎంకే అడ్రస్ లేకుండా పొతుందని చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు.
తమిళనాడులోని తూత్కుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారంనాడు శంకుస్థాపన చేశారు. అయితే, అనూహ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన 'ఇస్రో' యాడ్ తీవ్ర దుమారం రేపింది. ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు డీఎంకేను తప్పుపట్టగా, తూత్తుకుడి ఎంపీ కనిమొళి డీఎంకేను సమర్ధించారు.
‘ఇండియా’ కూటమిలో క్రియాశీలకంగా వున్న కాంగ్రెస్ - డీఎంకే(Congress - DMK) మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం అసంతృప్తి సెగలు పుట్టిస్తోంది.
వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ(PM Modi) బుధవారం తమిళనాడు(Tamilnadu)లో పర్యటిస్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే అయినా.. దానికి రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన పదవీకి సోమవారం నాడు రాజీనామా చేశారు. ఉద్యోగాల కుంభకోణంలో (క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్) సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత ఏడాది జూన్ 14వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ రాకపోవడంతో పదవికి రాజీనామా చేశారు.
‘ముఖ్యమంత్రిగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’ అంటూ డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) తన ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం గత నెల 31వ తేది రాష్ట్రపతి ప్రసంగం తర్వాత పార్లమెంటులో తాత్కాలి బడ్జెట్ ప్రవేశపెట్టింది.