Home » Doctor
ప్రాణపాయంలో ఉన్న యువకుడికి గ్రామీణ వైద్యుడు రాంబాబు సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన బల్లేపల్లిలో జరిగింది. వైద్యుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది. దీంతో వైద్యుడికి స్థానికులు అభినందనలు తెలిపారు.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా డీహెచ్ పరిధిలోని 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతోపాటు 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
భోజనం చేశాక తీరిగ్గా కూర్చుని చల్లటి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలింది! అది పళ్ల కింద నలగలేదు.. అంటే డ్రైఫ్రూట్ కాదు. అనుమానమొచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగుతిన్నాడు! అది.. మనిషి చేతి వేలు! ముంబైలోని పశ్చిమ మలాద్ ప్రాంతంలోని ఓర్లెమ్ బెండన్ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన, భయానక అనుభవం ఎదురైంది.
కాలేజీలో ఫంక్షన్ అయినా.. పబ్‌ల్లో పార్టీ అయినా.. మాల్స్‌లో కార్యక్రమాలైనా ఇటీవలి కాలంలో ఎనర్జీ డ్రింక్స్(Energy drinks)ను ఫ్రీగా అందుబాటులో ఉంచుతున్నారు. ఉచితంగా వస్తుండడంతో చాలామంది వీటిని ఒకటి కంటే ఎక్కువగానే తాగేస్తున్నారు.
ఇద్దరు మోసగాళ్లు దయ్యాల పేరుతో డాక్టర్‌ను, ఆయన భార్యను భయపెట్టారు. ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 31 లక్షల నగదు, సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకోండి..
‘సారీ.. పేషెంట్ రావడం ఆలస్యమైంది. ఒక ఐదు నిమిషాల ముందు వచ్చి ఉన్నా ప్రాణాలను కాపాడేవాళ్లం..’ ఈ డైలాగ్ చాలా సినిమాల్లో ఉంటుంది. చాలామందికి అనుభవంలోకీ వచ్చి ఉంటుంది. రోగికి సకాలంలో వైద్యం అందడం ఎంత కీలకమో.. ఈ మాటలు చెబుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, హార్ట్ ఎటాక్, బ్రెయిన సో్ట్రక్ వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆస్పత్రికి సకాలంలో వెళ్లగలగాలి. ప్రమాదం తలెత్తిన తరువాత మొదటి గంటపాటు సమయాన్ని ‘గోల్డెన అవర్’ అని వైద్యులు అంటుంటారు. అంటే.. ఆ సమయంలో వైద్యం అందిస్తే రోగి ప్రాణాలు నిలబడతాయి. లేదా.. ప్రమాద తీవ్రత బాగా తగ్గుతుంది. ఇదీ.. సమయానికి ఉన్న విలువ. ప్రాణాలు నిలబెట్టే వైద్యులకు...
రాష్ట్రంలో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే ప్రతీ వంద డెలివరీల్లో 75 సిజేరియన్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో 46.4 శాతం కడుపుకోతలే ఉండటం గమనార్హం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిమ్స్ వైద్యులను ప్రశంసించారు. సోది నంద అనే ఆదివాసి యువకుడి ఛాతీభాగంలో దిగిన బాణాన్ని నిమ్స్ కార్డియోథోరాసిక్ వైద్యు లు తొలగించిన విషయం విదితమే.
తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బి. సాల్మన్ నాయక్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిగా పనిచేస్తున్న సాల్మన్ నాయక్‌ను..
హైదరాబాద్ మే 25: ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య మండలి హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్ పరిధిలో పలు క్లినిక్‌లపై అధికారులు దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. అనుమతుల లేకుండా నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లను సీజ్ చేశారు.