Home » Duddilla Sridhar Babu
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియా కంపెనీ షూఆల్స్ ప్రకటించింది. ఈ కంపెనీ.. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.
అమెరికాకు చెందిన థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ‘బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ (బీడీసీ)’ను నెలకొల్పబోతోంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ), స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్తో కలిసి హైదరాబాద్‌కు దక్షిణాన 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఐటీ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
మూసీ కూల్చివేతలపై పేదలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని ఫ్రెంచ్ ఏరోస్పేస్ పరిశ్రమల సంఘం ప్రశంసించింది. ఇప్పటికే ఇక్కడ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్నాయని గుర్తుచేసింది.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ‘సింగరేణిని బతికిద్దాం.. మనం బతుకుదాం’ అని ఆ సంస్థ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.