Home » Earthquake
అస్సాంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3:01 గంటల సమయంలో ధుబ్రి జిల్లాలో భూకంపం వచ్చింది.
మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్ నుంచి మరకేష్ వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరులో మరోసారి శుక్రవారం తెల్లవారుజాము 4.43 గంటలకు స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా గృహాలు ఊగాయి. దీంతో ప్రజలు నిద్రలో ఉలిక్కిపడ్డారు.
చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి 2:33 గంటల సమయంలో 5.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ దెబ్బకు భారీ విధ్వంసం జరిగింది. డజన్లకొద్దీ భవనాలు నేలమట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
ఒకవైపు దేశాన్ని వర్షాలు ముంచెత్తుతుంటే.. మరోవైపు భూకంపాలు భయం పుట్టిస్తున్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో శుక్రవారం తెల్లవారుజామున మూడు భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మూడు భూకంపాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలో సంభవించాయి. మొదటి భూకంపం ఉదయం 4:09:38 గంటలకు సంభవించగా.. దాని తీవ్రత 4.4 గా ఉంది. రెండవ భూకంపం.. 04:22:57 గంటలకు సంభవించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. మూడవసారి 4.25:33 గంటలకు.. 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీ, జమ్మూ-కశ్మీరు తదితర ఉత్తరాది ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించింది. జమ్మూ-కశ్మీరులోని కీస్త్వర్కు ఆగ్నేయ దిశలో 30 కిలోమీటర్ల దూరంలో 5.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటెర్రేనియన్ సీస్మొలాజికల్ సెంటర్ ఈ వివరాలను తెలిపింది.
అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్పూర్లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....
ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. ఉత్తర కాలిఫోర్నియాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది...
ఒకే రోజు మూడు చోట్ల భూకంపం సంభవించింది...
నేపాల్ దేశంలో గురువారం రాత్రి రెండు సార్లు భూకంపం సంభవించింది...