Home » East Godavari
తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో ప్రమాదం జరిగింది. సముద్రంలో నాటు పడవ బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న (సోమవారం) సాయంత్రం నాటు పడవలో ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు.
మహేందర్ మృతికి తనకు ఎటువంటి సంబంధం లేదని హోం మంత్రి తానేటి వనిత ( Taneti Vanita ) అన్నారు.
తూ.గో. జిల్లా: కొవ్వూరు మండలం, దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడు మహేందర్ ఆత్మహత్య కేసు వివాదం సమసి పోయింది. బాధితుని కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా: కొవ్వూరు మండలం, దొమ్మేరులో పోలీసులు మీడియాపై కఠిన ఆంక్షలు విధించారు. ఆ గ్రామంలోకి మీడియాను అనుమతించలేదు. మృతుడు మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళితులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయం బీఆర్ఎస్లో వ్యక్తమవుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.
పాలకొల్లులో ఉద్రికత్త చోటు చేసుకుంది. ‘టిడ్కో ఇళ్ల వద్ద వంటా వార్పు, పాలకొల్లును చూడు’ పేరు మీద నిరసనకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే రామానాయుడు ఇంటిని పోలీసులు ముట్టడించారు. ఎమ్మెల్యే బయటకు రాకుండా గృహ నిర్బంధం విధించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhrapradesh: దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగని మహాశక్తి యాగం కాకినాడ శ్రీ పీఠం కేంద్రంగా రేపటి (నవంబర్ 14) నుంచి నెల రోజుల పాటు జరుగుతోందని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి తెలిపారు.
Andhrapradesh: ద్వారకాతిరుమలలో ఉమ్మడి గోదావరి జిల్లా కాపునాడు పట్టణ, మండల ప్రతినిధులు శనివారం ఉదయం సమావేశమయ్యారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
నరసాపురంలో మూడు రోజుల క్రితం పట్టపగలు ఎస్బీఐ బజారు బ్రాంచిలో సిబ్బందిని కత్తితో బెదిరించి రూ 6.50 లక్షలు చోరీ చేశారు.