Taneti Vanita: మహేందర్ మృతికి నాకు ఎటువంటి సంబంధం లేదు
ABN , First Publish Date - 2023-11-17T21:09:07+05:30 IST
మహేందర్ మృతికి తనకు ఎటువంటి సంబంధం లేదని హోం మంత్రి తానేటి వనిత ( Taneti Vanita ) అన్నారు.
కొవ్వూ రు: మహేందర్ మృతికి తనకు ఎటువంటి సంబంధం లేదని హోం మంత్రి తానేటి వనిత ( Taneti Vanita ) అన్నారు. శుక్రవారం నాడు కొవ్వూ రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘నాపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మహేందర్ ఆస్పత్రిలో జాయిన్ అయిన దగ్గర్నుంచి వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని డాక్టర్లకి సూచించాను. ఈరోజు సీఎం జగన్ని కలిసి సీఐడీ విచారణ వెయ్యమని కోరాను.సీఐడీ విచారణకి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ ఎంక్వైరీలో మహేందర్ మృతి వెనక నిజనిజాలు నిగ్గు తేలతాయి. జనసేన పార్టీకి చెందిన నాయకులు దురుద్దేశంతో ఆరోపణ చేస్తున్నారు’’ అని తానేటి వనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.