Home » Education
వర్షాల సీజన్ కావడంతో విద్యార్థులకు అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సూచించారు. సమనస మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యారంగంలో ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిషన్ గడువు రెండేళ్ల పాటు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎ్ఫ)- 2024’ ర్యాంకుల్లో కేఎల్హెచ్ డీమ్డ్ యూనివర్సిటీ(హైదరాబాద్)కి జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు లభించిందని ఆ యూనివర్సిటీ ఉపకులపతి పార్థసారధి వర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
తమకు కనీస అవసరాలు కల్పించాలంటూ ఓవైపు తెలంగాణ ఆడబిడ్డలైన విద్యార్థినులు వీధుల్లో పోరాటం చేస్తుంటే.. ఇంకోవైపు హైదరాబాద్లో మరో ‘జూ’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ప్రభుత్వం మొద్ద నిద్ర వీడి విద్యా వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ గ్రూప్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది టీజీపీఎస్సీ. గ్రూప్ 3 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరోసారి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యార్థులు లేరంటూ 1,864 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
అక్షరాలు దిద్దించి ఉన్నత స్థానానికి ఎదగడానికి పునాదిగా నిలిచిన బడిని మరిచిపోకుండా రూ.26 లక్షలతో భవనం నిర్మించి బహుమానంగా ఇచ్చారు ఓ ఎన్ఆర్ఐ.. జిల్లాలోని మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుల లక్ష్మీనరసింహచైనులు 1940-45 మధ్య ఆదుర్రు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు విద్యనభ్యసించారు.
మండల విద్యాశాఖాధికారి-2గా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని ఎంఈవో-2లు అంతా డీఈవో ఎం.కమలకుమారికి వినతిపత్రం అందజేశారు.