Araku : గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలకలం
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:55 AM
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
కలుషితాహారం తిని 110 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత
60 మందికి పైగా అరకు ఏరియా ఆస్పత్రికి తరలింపు
అరకులోయ, ఆగస్టు 30: గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికి విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పాఠశాలలోని 110 మంది వరకూ అస్వస్థతకు గురవ్వగా, 60 మందిని అంబులెన్స్‌లలో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇందులో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. వైద్య సిబ్బంది విద్యార్థినులకు సేవలను అందిస్తున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారి జమాల్ బాషా ఆస్పత్రికి చేరుకుని బాధితులకు సక్రమంగా వైద్యసేవలందేలా పర్యవేక్షిస్తున్నారు.