Home » Election Commission of India
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
నిన్న జరిగిన పోలింగ్‌లో 31 చోట్ల ఎన్నికలకు అంతరాయం కలిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) అన్నారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, శ్రీకాళహస్తి తదితర చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందని అన్నారు. ఆయా చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరామని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం..
పార్టీల నేతలు, కార్యకర్తలను పోలింగ్ డే హీటెక్కిస్తే.. భానుడు మాత్రం శాంతించాడు. ఆదివారం దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా భారీ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా పోలింగ్ రోజైన సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న అతి చిన్న పూరి గుడిసెను నల్లమల చెంచులు బొడ్డు గుడిసె అంటారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట మండల పరిధిలోని రాయలేటిపెంటలో అధికారులు ఇందులోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన...
ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. సాయంత్రం 6.00 గంటల కల్లా క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న వేళ.. వైసీపీ (YSRCP) తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల (Polling Booths) వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చాలా పోలింగ్ బూతుల్లో అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తోంది. ఓటర్లను వైసీపీ మూకలు భయ భ్రాంతులకు గురి చేసి దాడులకు తెగబడ్డారు.
సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు (YSRCP Leaders) రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడమే కాదు.. సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు.