Jammu Kashmir Assembly Elections: నేషనల్ కాన్ఫరెన్స్‌లో నేతలు తిరుగుబాటు
ABN , Publish Date - Aug 24 , 2024 | 04:51 PM
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో టికెట్ల కేటాయింపు షురూ అయింది. దీంతో పార్టీలోని పలువురు నేతల్లో అసమ్మతి ఎగసి పడుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తు పెట్టుకుంది. దీంతో పలు సీట్లు కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది.
శ్రీనగర్, ఆగస్ట్ 24: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో టికెట్ల కేటాయింపు షురూ అయింది. దీంతో పార్టీలోని పలువురు నేతల్లో అసమ్మతి ఎగసి పడుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తు పెట్టుకుంది. దీంతో పలు సీట్లు కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. ఈ నేపథ్యంలో సీట్లు దక్కని నేషనల్ కాన్ఫరెన్స్‌లోని పలువురు నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్దమయ్యారు. దాంతో ఆ పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలని వారంతా నిర్ణయించుకున్నారు. చీనాబ్ వ్యాలీతోపాటు బనిహాల్ ప్రాంతాలోని పలువురు కీలక నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
ఎన్నికల వేళ ఈ పరిణామం నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు 60 -30 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాలని ఒప్పందం చేసుకున్నాయి. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ వదులుకున్న స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో దింపుతుంది.
అలాంటి వేళ.. నేషనల్ కాన్ఫరెన్స్‌లోని పలువురు కీలక నేతలు పార్టీని వీడాలని నిర్ణయించారు. అదీకాక.. కాంగ్రెస్, నేషనల్ కాన్పరెన్స్ పార్టీలు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ఇప్పటికే నేషనల్ కాన్పరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల వేళ ప్రకటించిన విషయం విధితమే.
Also Read: Mumbai Dating scam: అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్న అందమైన అమ్మాయిలు
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి దాదాపు దశాబ్దం అనంతరం జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో.. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపేందుకు తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నాయి. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4వ తేదీన వెలువడనున్నాయి. తొలి దశ పోలింగ్‌కు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.