Home » Election Commission of India
ఏపీలో మే-13న సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) జరుగుండటంతో ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. అయితే.. అధికార వైసీపీ మాత్రం ఆ నియమాలను పాటించకుండా తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అత్యధిక ఉష్ణోగ్రతలతో కొన్ని రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అసలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలంటనే ప్రజలు హతలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. పోలింగ్ సమయాల్లో..
Lok Sabha Polls: తాను ఎన్నికల ప్రచారం చేయడాన్ని నిషేధం విధించడంపై బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. ఎన్నికల కమిషన్(Election Commission) 48 గంటలు తన ప్రచారాన్ని నిషేదించిందని.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని అన్నారు.
Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై కొందరు ఈసీని ఆశ్రయించగా..
ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అధికారులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓటు వేయండి.. గిఫ్ట్‌లు పట్టండి అంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసిన వారికి లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌తో పాటు ఇతర బహుమతులను ఆఫర్ చేయనున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ ఎన్నికల తేదీపై ఈసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీన జరగాల్సిన ఎన్నికల తేదీని మే 25వ తేదీకి మార్చింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
Andhrapradesh: జనసేన గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే మే నెలలో పెన్షన్‌కు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంపైనా సీఈసీకి మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ( AP Elections 2024)ల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల స్వీకరణ గడువు ఏప్రిల్ 25వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి (Election Commission) తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.