Share News

SIT Report to DGP: అలర్లపై ఈసీకి సిట్ నివేదిక.. ఏం తేల్చిందంటే?

ABN , Publish Date - May 20 , 2024 | 04:28 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ (మే -13) ముగిసిన తర్వాత జరిగిన అలర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు.

SIT Report to DGP: అలర్లపై ఈసీకి సిట్ నివేదిక.. ఏం తేల్చిందంటే?

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ (మే -13) ముగిసిన తర్వాత జరిగిన అలర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తు చేసిన నివేదికను ఈరోజు(సోమవారం) సిట్ అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక అందజేసింది. అనంతరం సీఈవో ఎంకే మీనాకు, కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక ఇచ్చింది.


150 పేజీలతో సుదీర్ఘ నివేదిక..

నిన్న(ఆదివారం) అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగించింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను సిట్ అధికారులు పరిశీలించారు. 150 పేజీలతో సుదీర్ఘ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ సమర్పించారు. అలాగే ఎన్నికల సంఘానికి నివేదికను ఇవ్వనున్నారు. మొత్తం ఐదు అంశాలపై సిట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేశారు. డీజీపీని కలిసి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నివేదికను సీఈఓ ఎంకే మీనాకు అందజేశారు.


దర్యాప్తులో అనేక లోపాలు: డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా

అల్లర్లపై డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తాకు సిట్ నివేదిక అందజేసింది. అనంతరం డీజీపీ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించినట్లు చెప్పారు. నిందితుల అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకు తెగబడ్డారన్నారు. ఈ అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామని చెప్పారు.

మరణాలకు దారి తీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని అన్నారు. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించటానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులను ఆదేశించారు. సీసీ టీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్‌లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని చెప్పారు. అల్లర్లకు పాల్పడ్డ వారిని అరెస్టులు చేయటంతో పాటు చార్జీ షీట్లు దాఖలు చేయాలని డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా ఆదేశించారు.


నిందితుల అరెస్టు‌కు కీలక ఆదేశాలు: సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌‌లాల్

అల్లర్లకు సంబంధించి 150 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించామని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. మొత్తం 33కేసుల్లో వివరాలను డీజీపీ పరిశీలించినట్లు తెలిపారు. దర్యాప్తులో చాలా లోపాలను గుర్తించి, సంబంధిత అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించామన్నారు.

సరైన సెక్షన్లతో కోర్టులో మెమో వేసి, ప్రస్తుతం ఉన్న సెక్షన్లకు అదనంగా కలపాలని ఆదేశించామని తెలిపారు. డిజిటల్ ఎవిడెన్స్ కింద సీసీ టీవీ ఫుటేజీ, వీడియోలను కూడా సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఛార్జిషీట్ వేయాలని చెప్పామన్నారు. సిట్ పర్యటనలో అనేక మంది బాధితులు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారని అన్నారు. వాటిని కూడా పరిశీలనకు పంపామని చెప్పారు. క్షేత్రస్థాయిలో బృందాలు పర్యటించి దర్యాప్తు అధికారులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి సమాచారం సేకరించాయని సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు.


1370 మందిని గుర్తించాం..

సాక్షుల స్టేట్‌మెంట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. జరిగిన సంఘటనల ఆధారంగా సెక్షన్లు పెట్టారా, అన్ని సంఘటనలపై కేసులు నమోదు చేశారా లేదా అనేది పరిశీలించినట్లు తెలిపారు. అరెస్టు అయిన నిందితులు నిజమైన వారా లేదా కూడా పరిశీలించామని అన్నారు. మొత్తం 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా చూపారని అన్నారు. ఇందులో 124 మందిని అరెస్టు చేశారని చెప్పారు.

పల్నాడు, తిరుపతి, అనంతపురాల్లో నమోదైన కేసులు, నిందితులు, అరెస్టు అయిన వారి వివరాలు, గుర్తించిన వారు తదితర వివరాలను వెల్లడించారు. జరిగిన సంఘటనలను తీవ్రమైన నేరాలుగా సిట్ పరిగణించిందని చెప్పారు. గ్రూపులుగా విడిపోయి విచక్షణా రహితంగా రాళ్లతో ఘర్షణలకు దిగారన్నారు. తాము ఇచ్చిన నివేదికను డీజీపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించినట్లు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు.


సిట్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు

పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై సిట్ అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని సిట్ కార్యాలయంలో ఈరోజు(సోమవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మల్లాది విష్ణు, కైలా అనిల్ కుమార్, ఏళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.


అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పలువురు అధికారులకు పోస్టింగులు

కాగా.. హింసాత్మక ఘటనలకు బాధ్యులు కావడంతో సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు వచ్చాయి. నరసరరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్సీగా కే.రవి మనోహర్ చారి, తాడిపత్రి డీఎస్పీగా కే జనార్దన్ నాయుడు, తిరుపతి ఎస్‌బీగా ఎం వెంకట్రాది, పల్నాడు స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా బీ.సురేష్ బాబు, యూ.శోభన్ బాబులు, కారంపూడి ఎస్‌ఐగా కే.అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా ఎం పట్టాభి, తిరుపతి ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా ఏ విశ్వనాథ్, అలిపిరి సీఐగా ఎం రామారావు, తాడ్రిపత్రి సీఐగా పీ.నాగేంద్ర ప్రసాద్‌లు నియామకం అయ్యారు. ఈ అధికారులు అందరినీ తక్షణమే విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ డీజీపీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు అధికారుల ప్యానల్లో ఒకరిని ఎంపిక చేసి ఎన్నికల సంఘం పోస్టింగులు ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 05:54 PM