Home » Election Commission of India
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా...? అని మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అధికార యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 109 మందిపై కోడ్ ఉల్లంఘనలపై చర్యలు వేటు వేశారు. అనంతపురం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో వలంటీర్లు, డీలర్లు, రేషన సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్‌కుమార్ విడుదల చేసిన బులెటిన ప్రకారం అత్యధికంగా రాయదుర్గం నియోజకవర్గంలోనే 29 మందిపై ఉల్లంఘనల కింద వేటు వేసారు.
కేంద్ర ఎన్నికల సంఘాని (Central Election Commission)కి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar) లేఖ రాశారు.ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని.. వారి ఓటును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వినియోగించు కోవడానికి కొన్ని నిబంధనలు పెట్టారని అన్నారు.
నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ఓటర్లకు అవగాహన పెంచేలా ఎన్నికల సంఘం (Election Commission) ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ (Jagan) సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని విధుల నుంచి తప్పించింది. ఎన్నికల వేళ మద్యం అక్రమ తరలింపు ఆరోపణల నేపథ్యంలో బదిలీ చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా 2016 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చేతన్‌ను నియమించింది.
ప్రచండ భానుడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నా.. వడగాడ్పులు వీస్తున్నా.. శుక్రవారం దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల వర్షం కురుస్తున్నా కూడా.. ఓటర్లు ఓపిగ్గా లైన్లో నిలబడి ప్రజాస్వామ్యంలో తమ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయం వరకూ ..
దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుక అయిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఉత్కంఠ ఎంతగా ఉందంటే ప్రజలు ఎండ వేడిని కూడా పట్టించుకోకుండా వచ్చి పెద్ద ఎత్తున ఓటు వేశారు. సీట్ల పరంగా ఇదే అతిపెద్ద దశ.
ఏపీలో సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission) నామినేషన్లను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో రెండో రోజు మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని.. తెలుగుదేశం - జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులను భయాభాంత్రుకు గురిచేస్తుందని జనసేన (Janasena) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మారెడ్డి శివశంకర్ రావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగనరెడ్డిపై జనసేన నేతలు ఎన్నికల సంఘాని (Election Commission)కి ఫిర్యాదు చేశారు.
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ(Lok Sabha Election 2024) ఓటింగ్ ఈరోజు(ఏప్రిల్ 19న) నుంచి మొదలైంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్(voting) ఉదయం 7 గంటలకు మొదలు కాగా ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.