AP Election 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలి.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు
ABN , Publish Date - May 14 , 2024 | 10:18 PM
నిన్న జరిగిన పోలింగ్‌లో 31 చోట్ల ఎన్నికలకు అంతరాయం కలిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) అన్నారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, శ్రీకాళహస్తి తదితర చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందని అన్నారు. ఆయా చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరామని చెప్పారు.
అమరావతి: నిన్న జరిగిన పోలింగ్‌లో 31 చోట్ల ఎన్నికలకు అంతరాయం కలిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) అన్నారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, శ్రీకాళహస్తి తదితర చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందని అన్నారు. ఆయా చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరామని చెప్పారు. పోలింగ్ పూర్తి అయ్యాక ప్రభుత్వంలోని అధికారులు కాంట్రాక్టర్లకు నిధులు పంచడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ లు కలిసి బిల్లులు చెల్లించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇది అతిపెద్ద ఆర్థిక నేరం అవుతుందని చెప్పారు.
రిజర్వు బ్యాంకు నుంచి వచ్చిన అప్పు తీసుకుని అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని.. వాటిని పక్కన పెట్టీ కొందరు కాంట్రాక్టర్ కు బిల్లులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకుండా దారి మళ్లించేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల కోడ్ పూర్తి అయ్యే వరకూ ఆ డబ్బు కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు వీల్లేదని వర్లరామయ్య అన్నారు. నిన్న జరిగిన ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో అరాచకాలు జరిగాయన్నారు. బూత్ ఏజెంట్లను ఇబ్బంది పెట్టారని చెప్పారు. రాళ్లు, కర్రలతో దాడులు చేశారన్నారు. ఓటరుపై ఓ ఎమ్మెల్యే దాడి చేశారని మండిపడ్డారు. ఓటరు కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారని చెప్పారు. ఎన్నికల పర్యవేక్షణలో పోలీసులు విఫలం చెందారని ఆరోపించారు.31 చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశామని వర్లరామయ్య పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Mukesh Kumar Meena: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..
Putta Mahesh: ఓటింగ్ అంతా కూటమికి అనుకూలం
Read Latest AP News And Telugu News